బడా బ్యానర్ లో రోషన్ మూడవ సినిమా... అధికారికంగా ప్రకటించిన మేకర్స్!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇప్పటికే ఎంతోమంది సినీ వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

ఇలా సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారిలో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ఒకరు.రోషన్ బాలనటుడిగా నటించడమే కాకుండా నిర్మలా కాన్వెంట్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

మొదటి సినిమా పరవాలేదు అనిపించుకున్నా, రెండవ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో రోషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం పెళ్లి సందD సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ క్రమంలోనే రోషన్ తన మూడవ సినిమాను టాలీవుడ్ బడా బ్యానర్ వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు.ఇక రోషన్ పుట్టిన రోజు కావడంతో ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు.

Advertisement

రోషన్ బ్యాక్ ఫోజ్ లో కనిపిస్తూ ఉన్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమాకి జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకున్న ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.ఇప్పటికే ప్రదీప్ స్క్రిప్ట్ పనులన్నింటినీ పూర్తి చేశారు.

త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ పనులను ప్రారంభించనున్నారు.ఇక ఈ సినిమాలో రోషన్ డిఫరెంట్ లుక్ లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని త్వరలో ప్రకటించనున్నారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు