టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి అప్పటి నుంచి తనదైన స్టైల్ లో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.కానీ ఆయన పదవి చేపట్టినప్పటి నుంచి సీనియర్ల సహకరించడం లేదనే వార్తలు వస్తున్నాయి.
కానీ ఆయన మాత్రం అందరినీ కలుపుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా.
ప్రస్తుతం రాష్ట్రంలో కొనుగోళ్ల విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.యాసంగిలో వరి కొనుగోలు చేయబోమని, వరి సాగుచేయవద్దని ప్రభుత్వం ఇటీవలే రైతులకు ఆదేశాలు జారీ చేసింది.
ప్రత్యామ్నాయ పంటపై ఫోకస్ పెట్టాలని సూచించింది.కేంద్ర విధానాల వల్లే ఇలా జరుగుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిందను కేంద్రపైకి నెట్టేసే ప్రయత్నాలు చేస్తోంది.
కేంద్రం సైతం అందుకు ధీటుగానే సమాధానమిస్తోంది.దీంతో చాలా మంది రైతులు వరి సాగుచేసేందుకు వెనకడుగు వేశారు.
ఇదే విషయమై కొద్ది రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ మారింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ ఉన్నట్టుండి ఆదివారం ఒక్కసారిగా బాంబ్ పేల్చారు.ఎర్రవల్లి గ్రామంలోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాల్లో వరి సాగుచేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అందుకు సంబంధించిన ఫొటోలను సైతం మీడియాకు చూపించారు.సోమవారం పంటను నేరుగా చూపిస్తానని సైతం వెల్లడించారు.

దీంతో అధికార పార్టీ నాయకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.రైతులను వరి సాగుచేయొద్దని చెప్పిన సీఎం.తన ఫామ్ హౌజ్ లో మాత్రం ఏకంగా 150 ఎకరాల్లో వరి ఎలా సాగుచేశారన్న ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి.కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్న రేవంత్ ప్రస్తుతం ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి మరో సారి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.
మరి ఈ విషయం ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి మరి.