వారానికోసారి ఎర్ర మందారంతో ఇలా చేస్తే హెయిర్ ఫాల్‌కు గుడ్‌బై చెప్పొచ్చ‌ట‌!

హెయిర్ ఫాల్‌కు దూరంగా ఉండాల‌ని స్త్రీలే కాదు పురుషులు కూడా కోరుకుంటారు.కానీ, నేటి ఆధునిక‌గా కాలంలో చాలా మంది అది అసాధ్యంగా మారింది.

జీవ‌న శైలిలో మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, పోష‌కాల కొర‌త‌, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, కాలుష్యం, దుమ్ము, ధూళి, ఒత్తిడి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌ను ఫేస్ చేస్తూ ఉంటారు.అయితే కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ హెయిర్ ఫాల్ స‌మ‌స్య‌ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ముఖ్యంగా ఎర్ర మందారంతో జుట్టు రాలే స‌మ‌స్య‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెప్ప‌వ‌చ్చు.అవును, ఎర్ర మందారం పూల‌లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు జుట్టు కుదుళ్ల‌కు బ‌లాన్ని చేకూర్చి.

రాల‌డానికి అరిక‌డ‌తాయి.మ‌రియు ఎర్ర మందారం వ‌ల్ల జుట్టు ఎల్ల‌ప్పుడూ న‌ల్ల‌గా, నిగ‌నిగ‌లాడుతూ క‌నిపిస్తుంది.

Advertisement

మ‌రి ఇంత‌కీ కేశాల‌కు ఎర్ర మందారాల‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా కొన్ని ఎర్ర మందార పూల‌ను తీసుకుని రేఖ‌ల‌ను తుంచుకోవాలి.

ఇప్పుడు ఒక పాన్‌లో క‌ప్పు బాదం ఆయిల్ పోసి.అందులో తుంచికున్న ఎర్ర మందారాన్ని వేసుకోవాలి.

అపై ఐదు నుంచి ఐదు నిమిషాల పాటు హీట్ చేసి.గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత నూనెను ఫిల్ట‌ర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ నూనెను జుట్టు కుదుళ్ల‌కు బాగా ప‌ట్టించి కాసేపు ప‌ది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఆయిల్ అప్లై చేసుకున్న గంట త‌ర్వాత ఒక మిక్సీ జార్‌లో ఎర్ర మందారం రేఖ‌లు కొన్ని, ఒక స్పూన్ మెంతులు, అర క‌ప్పు ఉల్లి పాయ ముక్క‌లు, కొన్ని క‌ల‌బంద ముక్క‌లు మ‌రియు రెండు స్పూన్లు పెరుగు వేసి మెత్త‌గా చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని జుట్టు మొత్తానికి ప‌ట్టించి గంట అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకే ఒక్క సారి చేశారంటే ఖ‌చ్చితంగా జుట్టు రాల‌డం త‌గ్గి.

Advertisement

పెర‌గ‌డాన్ని గ‌మ‌నిస్తారు.మ‌రియు జుట్టు న‌ల్ల‌గా, షైనీగా మెరిస్తుంది.

తాజా వార్తలు