తెలంగాణలో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ పంపిణీ..!!

దేశంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం జూన్ 21 నుండి సుగమం చేసే రీతిలో గైడ్ లైన్స్ ఇవ్వడం తెలిసిందే.

దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారు ఫ్రీగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అనే రీతిలో నిబంధనలు తీసుకురావటం మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వలు వ్యాక్సిన్ కి సంబంధించి రూపాయి చెల్లించనవసరం లేదని తెలపడంతో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి ప్రజలకు భారీ ఎత్తున టీకాలు ప్రజలకు వేస్తున్నాయి.ఈ క్రమంలో వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.86 లక్షల మందికి పైగా మొదటి డోసు, 36 లక్షల మందికిపైగా రెండవ డోసు వ్యాక్సినేషన్ పంపిణీ విషయంలో ఐదు నెలల వ్యవధిలో దాదాపు కోటి మందికి వ్యాక్సిన్ వేసి మంచి స్పీడ్ మీద ఉంది.రాష్ట్రంలో అని జిలాల్లో హైదరాబాద్ లో భారీగా వాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరిగింది.

చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

తాజా వార్తలు