Tarun - Abbas: తరుణ్, అబ్బాస్ ప్రతిభ ఉన్నా సినిమాలు చేయకపోవడానికి రీజన్ ఇదేనా?

ప్రముఖ టాలీవుడ్ నటుడు ఎమ్మెస్ నారాయణ కొడుకు ఎమ్మెస్ విక్రమ్ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

నాకు హీరోగా నిలదొక్కుకోవాలని అనిపించిందని అయితే నాన్నగారు నేను నటుడు కావాలని కోరుకోలేదని ఆయన తెలిపారు.

నా వరకు నేను కృషి చేశానని ఈరోజు వరకు సినిమా ఇండస్ట్రీ అంటే ప్రాణం అని ఆయన చెప్పుకొచ్చారు.నేను ప్రస్తుతం డబ్బులు బాగానే సంపాదిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

అయితే సినిమా ఇండస్ట్రీ అనేది ఇండస్ట్రీ కాదని విక్రమ్ అన్నారు.సినిమా ఇండస్ట్రీలో కళాఖండాలు తెరకెక్కించాలని చాలామంది చేస్తారని ఆయన తెలిపారు.

నాన్న రైతు కుటుంబం నుంచి వచ్చి లెక్చరర్ అయ్యారని నాన్నకు కళ అంటే ఇష్టమని విక్రమ్ అన్నారు.సినిమా రంగంలో సక్సెస్ కావాలంటే లక్ కూడా ఉండాలని విక్రమ్ పేర్కొన్నారు.

Advertisement

తరుణ్ చాలా టాలెంటెడ్ అని బాల నటుడిగా తరుణ్ కెరీర్ ను మొదలుపెట్టాడని విక్రమ్ చెప్పుకొచ్చారు.హ్యాపీడేస్ లో ఉన్నవాళ్లకు టాలెంట్ లేదా? అబ్బాస్ కు టాలెంట్ లేదా? అని ఆయన ప్రశ్నించారు.తరుణ్, అబ్బాస్ ప్రతిభ ఉన్నా టైమ్ బాలేక సినిమాలు చేయట్లేదని ఆయన తెలిపారు.

వరుణ్ సందేశ్ ఒకప్పుడు వరుస సక్సెస్ లు సాధించి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడని ఆయన చెప్పుకొచ్చారు.సినిమా రంగంలో కలిసిరావడం ముఖ్యమని ఎమ్మెస్ విక్రమ్ వెల్లడించారు.బ్యాగ్రౌండ్ ఎవరికీ వర్కౌట్ కాలేదని ఎమ్మెస్ విక్రమ్ అన్నారు.

అయితే బ్యాగ్రౌండ్ ఉండటం వల్ల ఎక్కువగా హీరోలు కష్టపడి విజయం సాధించాల్సి ఉందని ఎమ్మెస్ విక్రమ్ పేర్కొన్నారు.నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేశానని ఎమ్మెస్ విక్రమ్ అన్నారు.

ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరూ కష్టపడతారని విక్రమ్ అన్నారు.ఎమ్మెస్ విక్రమ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ యాక్షన్ షురూ చేసేది అప్పుడేనట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు