పవన్ సినిమా వల్లే ఈ నటి సినిమాలు మానేసిందట.. షాకింగ్ విషయాలు రివీల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమా అటు పవన్ కళ్యాణ్ కు ఇటు హరీష్ శంకర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న శృతి హాసన్ కు ఈ సినిమాతోనే తొలి సక్సెస్ దక్కింది.అయితే అందరికీ ఈ సినిమా వల్ల మేలు జరిగినా హ్యాపీడేస్ సినిమాలోని అప్పు పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న గాయత్రికి మాత్రం మైనస్ జరిగిందని సమాచారం.

గాయత్రి తల్లి బెంగళూరు పద్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హ్యాపీడేస్ సినిమాలోని అప్పు పాత్ర కోసం బాయ్ కట్ చేయించుకోవాలని దర్శకుడు శేఖర్ కమ్ముల సూచించిన సమయంలో గాయత్రి చాలా ఏడ్చిందని బెంగళూరు పద్మ అన్నారు.ఆ తర్వాత హ్యాపీడేస్ మూవీలో అప్పు పాత్రను చూసి అందరూ మెచ్చుకోవడం తన కూతురికి సంతోషాన్ని కలిగించిందని ఆమె చెప్పుకొచ్చారు.

అయితే గబ్బర్ సింగ్ సినిమా తర్వాత అప్పు సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని బెంగళూరు పద్మ వెల్లడించారు.మొదట ట్రయాంగిల్ లవ్ అని చెప్పి గాయత్రిని ఆ పాత్రకు ఎంపిక చేశారని సినిమా రిలీజైన తర్వాత గాయత్రి పాత్రకు సంబంధించి నెగిటివ్ కామెంట్లు వినిపించాయని బెంగళూరు పద్మ చెప్పుకొచ్చారు.నెగిటివ్ కామెంట్ల వల్ల తన కూతురు సినిమాలు చేయనని చెప్పిందని బెంగళూరు పద్మ కామెంట్లు చేశారు.2019 సంవత్సరంలో గాయత్రికి పెళ్లి కాగా ప్రస్తుతం ఆమె సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.

Reasons Behind Gayatri Good Bye To Movies Details Here , Bangalore Padma , Ga
Advertisement
Reasons Behind Gayatri Good Bye To Movies Details Here , Bangalore Padma , Ga

గాయత్రి తల్లి బెంగళూరు పద్మ తెలుగులో చాలా సినిమాలలో నటించి మంచి పేరును సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం తెలుగు సీరియళ్లలో నటిస్తూ ఈమె బిజీగా ఉన్నారు.పలు సినిమాలలో బెంగళూరు పద్మ నటించగా ఆ సినిమాలు కూడా నటిగా గాయత్రికి మంచి పేరును తెచ్చిపెట్టాయి.

గాయత్రి తర్వాత సినిమాలతో కూడా సక్సెస్ లు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు