కిల్లర్‌గా మారుతున్న రవితేజ.. పట్టుకు తీరుతానంటోన్న కాప్

మాస్ రాజా రవితేజ ఇటీవల ‘డిస్కో రాజా’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.

క్రాక్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాస్ రాజా ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

ఇక ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసేందుకు రవితేజ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమా తరువాత రవితేజ తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు.

ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని ఓకే చేసిన రవితేజ, ఈ సినిమాను వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.కాగా ఈ సినిమాలో రవితేజ డ్యుయెల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

అందులో ఒకటి పవర్‌ఫుల్ కాప్ పాత్ర కాగా మరోటి కిల్లర్ పాత్ర అని తెలుస్తోంది.ఈ రెండు పాత్రల మధ్య నడిచే మైండ్ గేమ్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా తరువాత మరో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు డైరెక్షన్‌లో రవితేజ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే త్రినాథరావు చెప్పిన కథకు మాస్ రాజా పచ్చజెండా ఊపినట్లు చిత్ర వర్గాల టాక్.

ఏదేమైనా మరోసారి డ్యుయెల్ రోల్‌లో నటించి మెప్పించేందుకు రవితేజ వేస్తున్న ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

నా జీవితం లో నేను చేసిన పెద్ద తప్పు మహేష్ బాబు ఆగడు సినిమానే : శ్రీను వైట్ల
Advertisement

తాజా వార్తలు