ధమాకా అసలు సత్తా నేటి నుండి తేలిపోయేను.. హిట్టా? ఫ్లాపా?

రవితేజ హీరో గా త్రినాధరావు నక్కిన దర్శకత్వం లో రూపొంది ఇటీవలే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధమాకా సినిమా కు పాజిటివ్ టాక్ దక్కింది.

కలెక్షన్స్ కూడా మొదటి మూడు రోజు ల్లో ఆశించిన స్థాయి కంటే ఒకింత ఎక్కువగానే వచ్చాయి.

శని ఆదివారాల్లో ఈ సినిమా కు బాగానే కలిసి వచ్చింది.సోమవారం పబ్లిక్ హాలిడే కనుక నేడు కూడా కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉంది.

అయితే వీకెండ్స్ తో పోలిస్తే వీక్ డేస్ లో సినిమా కు కలెక్షన్స్ వీక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.ప్రతి సినిమా విషయం లో కూడా అదే జరుగుతూ ఉంటుంది.

ఇక ఈ సినిమా కు కూడా అదే జరుగుతుందని అంతా విశ్వాసంగా ఉన్నారు.అయితే కలెక్షన్స్ ఏమాత్రం డ్రాప్ అవుతాయి అనే దాన్ని బట్టి సినిమా యొక్క లాంగ్‌ రన్‌ కలెక్షన్స్ ఆధారపడి ఉంటుంది అనడంలో సందేహం లేదు.

Ravi Teja Dhamaka Movie Pre Release Event , Ravi Teja, Dhamaka Movie, Flim News,
Advertisement
Ravi Teja Dhamaka Movie Pre Release Event , Ravi Teja, Dhamaka Movie, Flim News,

భారీ అంచనాల నడుమ రూపొందిన ధమాకా సినిమా కు మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి.నాలుగో రోజు నుండి నమోదు అవ్వబోతున్న కలెక్షన్స్ ని బట్టి మొత్తం కలెక్షన్స్ ఎంత అనే విషయం ఆధారపడి ఉంటుంది.కనుక నేటి నుండి ఎలాంటి వసూళ్లు ఈ సినిమా రాబడుతుంది అనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ఈ సినిమా కు పోటీ గా విడుదలైన 18 పేజెస్ మంచి సక్సెస్ దక్కించుకొని కలెక్షన్స్ భారీగా రాబడుతోంది.మొదటి రోజే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.

మరి రవితేజ ధమాకా సినిమా ఆ బ్రేక్ ఈవెన్ సాధించేది ఎప్పుడో అంటూ ఆయన అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.ఈ సినిమా లో రవితేజకు జోడీగా శ్రీ లీలా నటించిన విషయం తెల్సిందే.

రవితేజ చాలా విభిన్నమైన పాత్రలో నటించి ఆయన అభిమానులకు తెగ నచ్చేశాడు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు