యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ప్రాజెక్టు కే కోసం ఆయన అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు.టైం ట్రావెల్ నేపథ్యం లో రూపొందుతున్న ఈ సినిమా కు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఎన్నో వందల సినిమా లను అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించిన వైజయంతి మూవీస్ వారు ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా యొక్క షూటింగ్ అప్డేట్ విషయానికి వస్తే.
ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్ సభ్యులు నిరాశ పరచుతూనే ఉన్నారు.ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆలస్యం అవుతూ ఉంటే.
భారీ స్టార్ కాస్టింగ్ ఈ సినిమా లో నటిస్తుండడంతో కొన్నిసార్లు డేట్స్ ఇబ్బంది అవుతున్నాయి.అందువల్ల కూడా సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగడం లేదని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం కానుకగా దర్శకుడు నాగ్ అశ్విన్.ప్రభాస్ అభిమానుల కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది.ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది ప్రస్తుతానికి రివిల్ చేయలేదు.కానీ ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఆ సర్ప్రైజ్ సర్ప్రైజింగ్ గానే ఉంటుందని అంటున్నారు.
ప్రభాస్ కి జోడి గా ఈ సినిమా లో దీపికా పదుకొనే నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఈ సినిమా లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇది ఒక పాన్ ఇండియా సినిమా కాకుండా పాన్ వరల్డ్ మూవీ గా నిలవబోతోంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు.మరి వారి నమ్మకం ఎంత మేరకు నిజమవుతుంది అనేది తెలియాలి అంటే సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.