డబుల్ డిజాస్టర్స్ కు మాస్ రాజా జవాబు ఇస్తాడా.. ఇయర్ ఎండ్ లో 'ధమాకా' చేస్తాడా?

మాస్ మహారాజా అంటేనే ఎనర్జిటిక్ హీరో అని పేరు ఉంది.ఈయన ఎనర్జీని ఎవ్వరు కూడా బీట్ చేయలేరు అనే చెప్పాలి.

ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్ తో స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ ఇప్పటికీ అదే స్పీడ్ తో సినిమాలు చేస్తున్నాడు.అయితే అప్పుడు ఉన్నంత సక్సెస్ రేట్ ఇప్పుడు అందుకోలేక పోతున్నాడు.

బాక్సాఫీస్ దగ్గర ఒక సినిమాతో సక్సెస్ అందుకుంటే వెంటనే వరుసగా ప్లాప్స్ ఎదురవుతున్నాయి.ఈ మధ్య అయితే ఈయన సినిమాలు మరిన్ని నష్టాలను చవి చూస్తున్నారు.

క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత మరో సూపర్ హిట్ పడుతుంది అనుకుంటే మాస్ రాజా వరుసగా రెండు సార్లు నిరాశ పరిచాడు.డబుల్ డిజాస్టర్స్ అందుకుని దారుణంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే.

Advertisement

ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.అయితే అనూహ్యంగా రవితేజ ఇప్పుడు చేస్తున్న సినిమాపై మాత్రం ఎప్పుడు లేనంత క్రేజ్ పెరిగి పోయింది.ప్రెసెంట్ రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమా చేస్తున్నాడు.2022లో రెండు బ్యాక్ టు బ్యాక్ భారీ డిజాస్టర్స్ తర్వాత ఇప్పుడు ధమాకా సినిమా రిలీజ్ కాబోతుంది.మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా ఫలితం తేలబోతుంది.

మరి మాస్ రాజా పెట్టుకున్న హోప్స్ ఈ సినిమా నిలబడుతుందా? లేదా? అనే దానిపై అందరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇంతటి ఉత్కంఠ మధ్య ఈ రోజు ధమాకా రిలీజ్ కాబోతుంది.ఈ సినిమా వైబ్స్ చూస్తుంటే హిట్ అయ్యేలానే కనిపిస్తుంది.ఇయర్ ఎండ్ లో అయినా మాస్ రాజా ధమాకా చేస్తాడా లేదా చూడాలి.

ఇక ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.అలాగే వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

ఇంక భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు