త్రిష, నయనతారలను రష్మిక వెనక్కు నెట్టేసిందా.. ఆమె రెమ్యునరేషన్ ఎంతంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న( Rashmika Mandanna ) పరిచయం అవసరం లేని పేరు.

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో గుర్తింపు పొందారు.

కిరిక్ పార్టీ సినిమా ద్వారా హీరోయిన్ గా కన్నడ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె అనంతరం తెలుగులో ఛలో అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నారు.ఇలా మొదటి సినిమా మంచి హిట్ కావడంతో అనంతరం ఈమె టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం అందుకున్నారు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) తో కలిసి పుష్ప సినిమా( Pushpa Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈమె క్రేజ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది.దీంతో బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Advertisement

ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న రష్మిక రెమ్యూనరేషన్( Rashmika Remuneration ) విషయంలో కూడా భారీగానే తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో నయనతార,( Nayanatara ) త్రిష( Trisha ) వంటి వారు ఒక్కో సినిమాకు 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటూ మొదటి స్థానంలో ఉండగా రష్మిక ఇప్పుడు నయనతార త్రిష వంటి వారిని కూడా వెనక్కి నెట్టారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈమె మురగదాస్ డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సికిందర్ సినిమాలో ఛాన్స్ అందుకున్నారని సమాచారం .ఈ సినిమాకు ఏకంగా 15 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయగా మేకర్స్ 13 కోట్లు ఇవ్వటానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఇలా శ్రీవల్లి భారీ స్థాయిలో రేటు పెంచేసి కెరియర్ పరంగా బిజీ అవుతున్నారని చెప్పాలి.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే పుష్ప 2, సినిమాతో పాటు కుబేర వంటి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు