విజయ్ రష్మికను పక్కన పెట్టాడా.. దానికి కారణం ఇదేనా?

గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న ను నేషనల్ క్రష్ గా అభిమానులు ఎంతో అభిమానంగా పిలుచు కుంటారు.

ఈమె నిన్న మొన్నటి వరకు సౌత్ హీరోయిన్ గా మాత్రమే అందరికి తెలుసు.

అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి రష్మిక మెల్లమెల్లగా అంతటా గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుని పాన్ ఇండియా హీరోయిన్ గా మారి పోయింది.

ఈమె కెరీర్ లో సరిలేరు నీకెవ్వరూ, భీష్మ, పుష్ప లాంటి సక్సెస్ లు వచ్చాయి.అయితే ఇటీవలే ఈమెకు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో వచ్చి విఫలం అయ్యింది.

ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ హైప్ వచ్చింది.కానీ ఈమెకు సక్సెస్ మాత్రం దక్కలేదు.

Advertisement
Rashmika Replaced Krithi Sanon In Vijay Vamshi Paidipally Movie Details, Krithi

దీంతో ఈమెకు ప్లాప్ రావడంతో కొద్దిగా డీలా పడిన మళ్ళీ పడిలేచిన కెరటంలా రష్మిక మళ్ళీ వరుస సినిమా షూటింగులతో బిజీ అయ్యింది.ప్రెసెంట్ పుష్ప 2 సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Rashmika Replaced Krithi Sanon In Vijay Vamshi Paidipally Movie Details, Krithi

ఇది కాకుండా ఈమె బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా మారిపోవాలని ప్రయత్నాలు సాగిస్తుంది.అలాగే ఇంకో పక్క కోలీవుడ్ లో కూడా ఈ అమ్మడు నటించడానికి సిద్ధంగా ఉంది.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ తో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

Rashmika Replaced Krithi Sanon In Vijay Vamshi Paidipally Movie Details, Krithi

ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా జరుపు కుంటుంది.ఇందులో ముందుగా రష్మిక నటించనుందని వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో రష్మిక బదులుగా కృతి సనన్ ఎంపిక అయినట్టు తెలుస్తుంది.

విజయ్ కూడా కృతి సనన్ కే ఓటు వేయడంతో రష్మిక సేడ్ అయిపొయింది.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త వైరల్ అయ్యింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు