పాపం రష్మిక.. ఏది ముట్టుకున్న అట్టర్ ప్లాపే.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే టైమ్ వచ్చేసిందా?

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం రష్మిక మందన టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో రష్మిక పరిస్థితి అంత బాగోలేదు అని చెప్పవచ్చు.

మరి ముఖ్యంగా కెరియర్ పరంగా ఆమె ఏది ముట్టుకున్నా కూడా తనకు షాక్ కొడుతోంది.ఇటీవల విడుదలైన కాంతార సినిమా విషయంలో కాంట్రవర్సీని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఆ వివాదంలో భాగంగా కన్నడ సినిమా పరిశ్రమ రష్మిక ని నిషేధం చేస్తుంది అంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి.ఇది ఇలా ఉంటే తాజాగా రష్మిక మందన ఆ వివాదంపై స్పందిస్తూ కాంతార సినిమాను తను కాస్త ఆలస్యంగా చూశానని చెబుతూనే, తనపై నిషేధం లాంటివేవీ లేదని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది.

Advertisement
Rashmika Is Facing Back To Back Set Backs Rashmika Mandanna, Tollywood, Bollyw

అయితే మరొకవైపు బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి రష్మిక చేస్తున్న ప్రయత్నాలు అన్ని కూడా బెడిసికొడుతున్నాయి.

Rashmika Is Facing Back To Back Set Backs Rashmika Mandanna, Tollywood, Bollyw

రష్మిక నటించిన గుడ్ బై సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఆ తర్వాత ప్రస్తుతం రెండో సినిమా అనగా మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.అయితే కనీసం మిషన్ మజ్ను సినిమాతో అయినా సక్సెస్ అందుకోవాలి అనుకున్న రష్మిక కలలు ఆవిరి అయ్యాయి.

ఎందుకంటె థియేటర్లలో రిలీజ్ అవ్వాల్సిన మిషన్ మజ్ను సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది.దీంతో రెండో సినిమాతో క్రేజ్ అందుకోవాలనుకున్న రష్మిక ఆశలకు బ్రేక్ పడినట్లు అయ్యింది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరో రాలేడా..?
రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...

ఇక బాలీవుడ్ లో మూడో ప్రాజెక్టు యానిమల్.ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది.

Advertisement

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం సౌత్లో చాలా అవకాశాలను వదులుకుంది ఈ ముద్దుగుమ్మ.దాంతో సౌత్ లో అవకాశాలు భారీగా తగ్గిపోయాయి.

ఇక బాలీవుడ్ లో కూడా క్రేజ్ రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది ఈ బ్యూటీ.

తాజా వార్తలు