రియల్ రామారావు ఆన్ డ్యూటీ.. కేటీఆర్ పై రవితేజ డైరెక్టర్ స్పెషల్ పోస్ట్!

మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో ఎప్పుడు ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటాడు.ఇక ఈయన ప్రెజెంట్ చేస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ.

శరత్ మండవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.జులై 29న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా నుండి వరుసగా ప్రొమోషనల్ కార్యక్రమాలు చేస్తూ ప్రేక్షకులకు చేరువ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా డైరెక్టర్ శరత్ మండవ కూడా సోషల్ మీడియా వేదికగా వరుస ప్రొమోషన్స్ చేస్తున్నాడు.శరత్ మండవ ఈ సినిమా కోసం ఎవ్వరూ ఇయ్యనన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడని స్వయంగా రవితేజ ఒక సభాముఖంగా చెప్పుకొచ్చాడు.

ఇంటర్వ్యూలు మాత్రమే కాకుండా యూత్ కోసం సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ వారిని ఆకర్షించడం కోసం వరుస ప్రొమోషన్స్ చేస్తున్నాడు.తాజాగా ఈయన చేసిన ఒక పోస్ట్ అందరిని ఆకట్టుకుంటుంది.

Advertisement
'Ramarao On Duty' Director Sarath Mandava Interesting Post On KTR, KTR, Ravi Tej

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫోటోను షేర్ చేస్తూ ఆయనను ట్యాగ్ చేసి చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. కేటీఆర్ కు కాలిగాయం కారణంగా ఫుల్ రెస్ట్ లో ఉన్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈయన సోఫాలో కూర్చుని గాయంతోనే ఫైల్ ను తిరగేస్తున్న ఫోటోను షేర్ చేసాడు.

ramarao On Duty Director Sarath Mandava Interesting Post On Ktr, Ktr, Ravi Tej

ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ డైరెక్టర్ ఇదే ఫోటోను షేర్ చేస్తూ ఆ ఫొటోలో రామారావు ఆన్ డ్యూటీ లోగో కూడా జత చేసి అందరిని ఆకర్షించాడు.ఈ ఫోటో వైరల్ అవడంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా చర్చ జరుగుతుంది.మరి ఈ డైరెక్టర్ ప్రేక్షకులకు దగ్గర చేయడంలో సఫలం అయ్యాడనే చెప్పాలి.

చూస్తుంటే ఈ ప్రొమోషన్స్ తో ఓపెనింగ్స్ గట్టిగానే వచ్చేలాగానే ఉంది.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు