వర్మ దీన్ని అయినా కొన్నాళ్లు నడుపుతాడా మద్యలోనే మూసేస్తాడా?

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్‌ సెట్టర్ అనడంలో సందేహం లేదు.

రామ్‌ గోపాల్‌ వర్మ శివ సినిమా మొదలుకుని ఎన్నో ప్రయోగాలను చేశాడు.

ఆ సినిమా షూటింగ్‌ మొదలు అయిన సమయంలో వర్మ కు సినిమా లు తీయవచ్చా అంటూ కొందరు పెదవి విరిచారు.కాని ఆ ఆ సినిమా తర్వాత మొత్తం ఇండస్ట్రీ అంతా ఆయన వైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు.

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అంటూ పేరు దక్కించుకుని ఎన్నో వివాదాలకు తెర తీశాడు.సినిమా లతో ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేసిన దర్శకుడు వర్మ ఈ మద్య కాలంలో వివాదాలు ఎక్కువ కంటెంట్ తక్కువ అన్నట్లుగా సినిమా లు చేస్తున్నాడు.

ఆయన ఎన్నో కొత్త వాటిని మొదలు పెడతాడు కాని చివరి వరకు దాన్ని కొనసాగించడం లేదు.తాజాగా వర్మ స్పార్క్‌ అనే ఓటీటీ ని ఆరంభించాడు.

Advertisement

తన డి కంపెనీ సినిమా ను స్పార్క్ ద్వారా విడుదల చేయబోతున్నాడు.ఈనెల 15న ప్రారంభం కాబోతున్న స్పార్క్‌ ఓటీటీ కి సంబంధించి ప్రభాస్‌ వీడియోతో ప్రకటన చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి స్పార్క్‌ పై పడింది.

ఈ ఓటీటీ తో వర్మ తన సినిమాలతో పాటు బయటి వారి సినిమాలను కూడా స్ట్రీమింగ్‌ చేస్తాడని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.వర్మ ఏడాదికి పది పదిహేను సినిమాలను తీయగల సమర్ధుడు.

కనుక వర్మ ఒక్కడే స్పార్క్‌ ఓటీటీకి కంటెంట్ ఇవ్వగలడు.ఆయన మాత్రమే కాకుండా ఆయన శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు.

వారు కూడా స్పార్క్‌ కోసం కంటెంట్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.కనుక స్పార్క్‌ ను సరిగ్గా రన్‌ చేస్తే తప్పకుండా తెలుగు ఆహా ను బీట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల్లో కొందరు అంచనా వేస్తున్నారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

కాని వర్మ దీన్ని అయినా తుది వరకు నడుపుతాడా అంటే అనుమానమే అంటూ స్వయంగా ఆయన సన్నిహితులు అంటున్నారు. ఆమద్య శ్రేయాస్‌ ఈటీలో వరుసగా సినిమాలు విడుదల చేసి మద్యలో వదిలేసిన వర్మ ఇప్పుడు స్పార్క్‌ ను ఎప్పుడు వదిలేస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు