Rakul Preet Singh : రెండు రోజుల్లో పెళ్లి… హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన రకుల్.. వైరల్ అవుతున్న ఫోటోలు?

రకుల్ ప్రీత్ సింగ్( Rakul Preet Singh ) పరిచయం అవసరం లేని పేరు కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె అనంతరం వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించే అవకాశాలను అందుకున్నారు.

ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఓ వెలుగు వెలిగారు.ఇక ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే బాలీవుడ్ నటుడు నిర్మాత అయినటువంటి జాకీ భగ్నానీ( Jackky Bhagnani ) అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు.

ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఈ నెల 21వ తేదీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.ఇలా వీరిద్దరి వివాహం గోవాలో( Goa ) మూడు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది.

ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు అన్నీ కూడా ఘనంగా జరిగాయి ఫిబ్రవరి 19వ తేదీ నుంచి రకుల్ వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

Rakul Preet Singh Shocking Photoshoot In Front Of Marriage
Advertisement
Rakul Preet Singh Shocking Photoshoot In Front Of Marriage-Rakul Preet Singh :

ఇలా రకుల్ తన పెళ్లి పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా పెళ్లి( Rakul Marriage ) పనులలో బిజీగా ఉన్నటువంటి ఈమె మరోవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు.ఇలా పెళ్లికి రెండు రోజులు ముందు రకుల్ ప్రత్యేకంగా ఇలాంటి ఫోటోషూట్ చేయించడానికి కారణమేంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు పెళ్లికి రెండు రోజులు కూడా సమయం లేదు ఇలా ఫోటోషూట్ చేయడం ఏంటి అని ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు పైగా ఇది ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటే అది కూడా కాదు.

Rakul Preet Singh Shocking Photoshoot In Front Of Marriage

రకుల్ మాత్రమే ఇలాంటి హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఫోటోషూట్ చేయించుకున్నారు.అయితే ఈమె ఈ ఫోటో షూట్ చేయడం వెనుక కారణం లేకపోలేదని చెప్పాలి రకుల్ ఫోటోషూట్( Rakul Photoshoot ) చేయించినది ఎల్లే మ్యాగజైన్( Elle Magazine ) కోసం అని తెలుస్తుంది.ఈ మ్యాగజైన్ కోసమే ఈమె ప్రత్యేకంగా ఇలాంటి ఫోటోషూట్ చేయించారు.

రంగురంగుల దుస్తులలో ఈమె హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇక రకుల్ ప్రీత్ తన పెళ్లి కోసం గోవాలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఐటిసి గ్రాండ్ గోవా రిసార్ట్ ని బుక్ చేశారు.ఈ రిసార్ట్ లో 240 పైగా గదులు ఉన్నాయి.సిమ్మింగ్ పూల్స్, బీచ్ కి డైరెక్ట్ చేరుకునే సౌకర్యం, అనేక విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

 ఈ రిసార్ట్ లో ఒక్కో రూమ్ ఒక్క రోజుకు బుక్ చేసుకోవాలి అంటే దాదాపు 20 నుంచి 75 వేల రూపాయల వరకు అది చెల్లించాల్సి ఉంటుందని సమాచారం.మొత్తానికి రకుల్ ఆలస్యంగా పెళ్లి చేసుకున్న చాలా కాస్ట్లీ పెళ్లి చేసుకుంటుందని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు