'విక్రమ్‌' తర్వాత సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్ రగిలి పోతున్నారట!

తమిళ సినిమా ఇండస్ట్రీ అనగానే గుర్తుకు వచ్చే స్టార్స్ ఇద్దరు.వారి లో ఒకరు రజనీ కాంత్‌ కాగా మరొకరు కమల్‌ హాసన్.

వీరిద్దరు కూడా ఇండస్ట్రీ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నారు.దేశ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుని అప్పట్లో నే పాన్ ఇండియా స్టార్‌ హీరోలుగా అన్ని చోట్ల కూడా తమ సినిమా లను విడుదల చేసేంతటి స్టార్‌ డమ్‌ దక్కించుకున్నారు.

కాని గడచిన దశాబ్దం కాలంగా వీరు ఇద్దరు కూడా చాలా ప్లాప్ లు చవిచూశారు.కమల్‌ హాసన్ హిట్‌ సినిమా వచ్చి ఎంత కాలం అయ్యింది అంటే ఠక్కున చెప్పే పరిస్థితి లేదు.

అలాంటి కమల్‌ హాసన్ కు ఎట్టకేలకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన విక్రమ్‌ సినిమా హిట్ ను అందించింది.చాలా సంవత్సరాలుగా ఉన్న అప్పులు అన్నీ కూడా తీర్చే విధంగా విక్రమ్‌ సినిమా నిలిచింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు కమల్‌ హాసన్‌.

Advertisement
Rajinikanth Fans Waiting For Hit Movie After Vikram Movie ,rajinikanth,beast Mov

ఇప్పుడు అందరి దృష్టి కూడా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ నటిస్తున్న జైలర్‌ సినిమా పై ఉంది.

Rajinikanth Fans Waiting For Hit Movie After Vikram Movie ,rajinikanth,beast Mov

రజినీ రోబో తర్వాత కమర్షియల్ గా సక్సెస్‌ ను అందుకోలేదు.అందుకే కమల్‌ కు విక్రమ్‌ సినిమా సక్సెస్ పడ్డ తర్వాత రజినీకాంత్‌ అభిమానులు ఆవేశం తో రగిలి పోతున్నారు.తమ స్టార్ కు దక్కని హిట్ ఆయనకు దక్కిందని కమల్ పై సోషల్ మీడియా లో కొందరు గాలి వార్తలు పుట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

మొత్తానికి సోషల్‌ మీడియాలో రజినీకాంత్‌ అభిమానులు చాలా ఉత్సాహంతో జైలర్ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నామని చెబుతున్నారు.రజినీకాంత్ కూడా నెల్సన్ దిలీప్ పై నమ్మకం ఉంచి జైలర్ సినిమా పై చాలా నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు.

మరి జైలర్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.ఒక వేళ రజినీకాంత్ మళ్లీ ప్లాప్ అయితే అభిమానులు తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు