బీజేపీకి తలనొప్పిగా రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం..!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యవహారం ఆ పార్టీ బీజేపీకి తలనొప్పిగా మారిందని తెలుస్తోంది.

రాజాసింగ్ పై ఉన్న పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.

ఈ మేరకు రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతుందని సమాచారం.సస్పెన్షన్ ఎత్తివేత ఆలస్యం అయితే పార్టీకి నష్టం తప్పదని కార్యకర్తలు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ పార్టీ హైకమాండ్ కు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు సార్లు లేఖ రాశారు.మరోవైపు ఈ వ్యవహారంపై ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

సస్పెన్షన్ ఎత్తివేత ఆలస్యం అవుతోందని కార్యకర్తలు అనుకుంటున్నారంటూ ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

Latest Latest News - Telugu News