మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర( Anand Mahindra ) రోజూ ట్విట్టర్ లో ఏవోక వైరల్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు.ఆయన షేర్ చేసే వీడియోలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి.
వినూత్నంగా అనిపించే వీడియోలు, కొత్త ఐడియాలకు సంబంధించిన వీడియోలను ఆయన ఎక్కువగా తన ట్విట్టర్ అకౌంట్( Twitter )లో షేర్ చేస్తూ ఉంటారు.ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్ లో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు.
దీంతో ఆయన షేర్ చేసే వీడియోలకు వ్యూస్ కూడా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటాయి.ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న ఆనంద్ మహీంద్రా షేర్ చేయడం వల్ల ఏ వీడియో అయినా సరే మరింతగా వైరల్ అవుతూ ఉంటుంది.

ఎప్పటిలాగే తాజాగా మరో వైరల్ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు.ఈ వీడియోలో ఒక బుడ్డోడు వర్షాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.కుండపోత వర్షంలో ఆడుకుంటూ కనిపించాడు.మహారాష్ట్రలో ఇది చోటుచేసుకుంది.ముంబై సిటీలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.వర్షాకాలం సీజన్ మొదలు కావడం, ముంబై( Mumbai )ని వర్షాలు పలకరించడంతో ఆనంద్ మహీంద్రా ఈ బాలుడి వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ వీడియోను షేర్ చేస్తూ ఆయన పలు కామెంట్లు చేశారు.ఎట్టకేలకు ముంబైను వర్షం పలకరించిందని, ముంబైలో ఇంటికి చేరగానే రుతుపవనాలు పలకరించాయని వ్యాఖ్యానించారు.

ప్రతి భారతీయుడి మనసులో అంతర్గతంగా చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుందని, మొదటి జల్లులో కురిసి ఆ ఆనందాన్ని పొందాలని ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.ఇటీవల ఆనంద్ మహీంద్రా యూఎస్ పర్యటనకు వెళ్లారు.అక్కడ ముకేష్ అంబానీ, నానా వ్యోమగామి సునీతా విలియమ్స్, బృందా కపూర్ తో ఆయన దిగిన సెల్పీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.యూఎస్ నుంచి రాగానే ముంబైలో వర్షాలు స్టార్ట్ కావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ వీడియోను షేర్ చేశారు.








