గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యవహారం ఆ పార్టీ బీజేపీకి తలనొప్పిగా మారిందని తెలుస్తోంది.రాజాసింగ్ పై ఉన్న పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.
ఈ మేరకు రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతుందని సమాచారం.సస్పెన్షన్ ఎత్తివేత ఆలస్యం అయితే పార్టీకి నష్టం తప్పదని కార్యకర్తలు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరుతూ పార్టీ హైకమాండ్ కు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు సార్లు లేఖ రాశారు.మరోవైపు ఈ వ్యవహారంపై ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
సస్పెన్షన్ ఎత్తివేత ఆలస్యం అవుతోందని కార్యకర్తలు అనుకుంటున్నారంటూ ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు.