హత్ సే హత్ జూడో కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు అది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో హత్ సే హత్ జూడో కార్యక్రమంలో భాగంగా గడప గడపకు తిరుగుతుండగా నాగారంకు చెందిన అల్లె బుచ్చవ్వ 10 సంవత్సరాల నుండి ఇదే గుడిసెలో ఉంటున్నదని తెలుసుకొని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుచ్చవ్వకు డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇస్తామన్నారు.

రైతులకు రుణమాఫీ ఏక కాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, అలాగే వరి ధాన్యానికి మద్దతు ధర 2500 రూపాయలు ఇస్తామన్నారు.ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదవారికి సొంత ఇల్లు నిర్మాణానికి 5లక్షలు రూపాయలు ఇస్తామని అన్నారు.అదేవిధంగా రైతు పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం కేసీఆర్ నిన్నటి రోజున వడగండ్ల వానతోని నష్టపోయిన వారికి ఎకరానా 10,000 ఇస్తామని చెప్పినారని,కానీ గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వడగండ్ల వానతోని పంటలు ఎన్నో నష్టాలు జరిగినాయని

వారికి నష్టపరిహారం ఇవ్వకుండా ఈరోజు మళ్లీ వాగ్దానాలు చేయడం హాస్యస్పదమన్నారు.నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా,జిల్లా కార్యదర్శులు చందనగిరి గోపాల్, కచ్చకాయలు ఎల్లయ్య, తాళ్లపల్లి ప్రభాకర్,భాస్కర్ రావు,గ్రామ అధ్యక్షులు మ్యాకల స్వామి, నాగభూషణం,రవీందర్ రెడ్డి, శోభన్,హరీష్,మల్లయ్య, చంద్రయ్య,నరసయ్య,జనార్థన్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

Latest Rajanna Sircilla News