'ఆర్ఆర్‌ఆర్‌' సినిమా ఎన్ని సార్లు వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుంది బాబు?

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా గత నెల 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

సినిమా విడుదల అయ్యి రెండు వారాలు ముగిసి మూడవ వారంలో అడుగు పెట్టారు.

రెండవ వారం చివర్లోనే ఈ సినిమా వెయ్యి కోట్లు వసూళ్లు చేసింది అంటూ ముంబయి లో భారీ ఈవెంట్ ను నిర్వహించారు .ఆ ఈవెంట్‌ ల వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు అంటూ పోస్టర్ ను కూడా ప్రదర్శించారు.కాని అప్పటికి సినిమా వెయ్యి కోట్లు కాలేదు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా తెలియజేశారు.

కాని ఉత్తరాది ఫిల్మ్‌ మేకర్స్ అత్యుత్సాహంతో ఆ విధంగా చేశారు.హిందీ లో ఈ సినిమా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు దక్కింది.ఏమాత్రం అంచనాలు తగ్గకుండా అక్కడ ఇప్పటి వరకు 240 కోట్ల వసూళ్లను సినిమా రాబట్టింది అంటూ స్వయంగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక తాజాగా రెండు సార్లు ఆర్ ఆర్‌ ఆర్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేసింది అంటూ అఫిషియల్‌ అకౌంట్స్ ద్వారా ప్రకటన వచ్చింది.మొత్తం మూడు సార్లు ఈ సినిమా వెయ్యి కోట్లు అంటూ ప్రకటన వచ్చింది.

Advertisement

దాంతో అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క సినిమా ఇన్ని సార్లు వెయ్యి కోట్లు ఎలా సాధించింది అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.ఈ విషయంలో వారు చేస్తున్న గందరగోళ ప్రకటనలు మీడియా వారిని కన్ఫ్యూజ్ చేయడం తో పాటు ప్రేక్షకులను మరియు అభిమానులకు కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. ఈ భారీ బడ్జెట్ సినిమాలు ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర లో కనిపించిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు