ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలను చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం అవాక్కయ్యాయి.200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి2 ఫుల్ రన్ లో 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఏదనే చర్చ నెట్టింట తరచూ జరుగుతోంది.ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల వరకు బాహుబలి2 సినిమాను మించిన హిట్టైనా ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఈ రికార్డులు బ్రేక్ కాలేదు.
ఆర్ఆర్ఆర్ మూవీలో కొన్ని మైనస్ లు ఉండటం వల్ల ఈ సినిమా బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయింది.బాహుబలి2 సినిమా ఐదేళ్ల క్రితం విడుదలైనా ఆ సినిమా పేరిట ఎన్నో రికార్డులు పదిలంగా ఉన్నాయి.కేజీఎఫ్2 సినిమా బాహుబలి2 క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేయాలని యశ్ అభిమానులు కోరుకుంటున్నారు.తాజాగా బాహుబలి2 రికార్డులను కేజీఎఫ్ 2 బ్రేక్ చేస్తుందా అనే ప్రశ్న యశ్ కు ఎదురైంది.
ఆ ప్రశ్నకు యశ్ సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బాహుబలి2 సినిమా క్రియేట్ చేసిన రికార్డులను కేజీఎఫ్2 సినిమా బ్రేక్ చేస్తే మంచిదే కదా అని యశ్ అన్నారు.ఒక సినిమా సృష్టించిన రికార్డులను తర్వాత సినిమాలు బ్రేక్ చేయాలని యశ్ పేర్కొన్నారు.ఈ ప్రక్రియ అనేది ఎప్పటికీ కొనసాగాలని యశ్ వెల్లడించారు.ఈ విధంగా జరిగితే మాత్రమే ప్రోగ్రెస్ అవుతుందని యశ్ వెల్లడించారు.

అలా జరిగితే రికార్డులు కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయని యశ్ చెప్పుకొచ్చారు.యశ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కేజీఎఫ్2 నిజంగానే రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.కేజీఎఫ్2 భారీ సక్సెస్ సాధించాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.







