ఆస్కార్ ఎఫెక్ట్‌.. అమెరికాలో 'ఆర్ఆర్‌ఆర్‌' జోరు మామూలుగా లేదుగా!

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఇంకా సత్తా చాటుతూనే ఉంది.

ఇటీవలే జపాన్ లో ఈ సినిమా వంద రోజుల పూర్తి చేసుకుంది.

ఈ సినిమా ఇప్పుడు అమెరికాలో సందడి చేస్తోంది.ఈ వీకెండ్ కి అమెరికా లో భారీ ఎత్తున కలెక్షన్స్ నమోదవుతున్నాయి.

ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు ను సొంతం చేసుకోవడంతో పాటు ఆస్కార్ కి నామినేట్ అవ్వడం తో ఈ సినిమా గురించి అమెరికా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.అందుకే అమెరికన్ లు ఈ సినిమా ను చూసేందుకు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు.

ఈ వీకెండ్ లో ఈ సినిమా కు ఏకంగా మిలియన్ డాలర్ల వసూలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ యూఎస్ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. తెలుగు సినిమాలు విడుదలైన సమయంలోనే మిలియన్ డాలర్లు వసూలు చేయడం గొప్ప విషయంగా మాట్లాడుకుంటూ ఉంటాం.

Advertisement

అలాంటిది విడుదల అయ్యి దాదాపు సంవత్సరం కాబోతుంది.

ఈ సమయంలో యూఎస్ లో ఈ సినిమా మిలియన్ డాలర్ల ను ఈజీగా దక్కించుకోబోతుంది అంటే రాజమౌళి సినిమా యొక్క ఘనత ఏంటో అర్థం చేసుకోవచ్చు.ఆస్కార్ కి నామినేట్ అవ్వడం వల్లే అంతర్జాతీయ మీడియాలో అద్భుతమైన ప్రచారం దక్కింది.

ఆ ప్రచారం వల్లే ఇప్పుడు యూఎస్ లో సినిమా కు మంచి మార్కెట్ లభించిందని సినీ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో ఇంకా కూడా ఆర్ఆర్ఆర్ పేరు మారు మ్రోగిపోతూనే ఉంది అనే విషయం తెలిసిందే.ఆస్కార్ కి నామినేట్ అయిన నాటు నాటు పాట ను అమెరికన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారట.

ఈ జోరు ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో అనేది చూడాలి.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు
Advertisement

తాజా వార్తలు