ప్రభాస్ ఫంక్షన్ లో పవన్ ఫ్యాన్స్ జై పవర్ స్టార్ అని కేకలు వేశారు.. జక్కన్న తండ్రి కామెంట్స్ వైరల్!

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

విజయేంద్ర ప్రసాద్ ఎంతో కష్టపడి స్టార్ రైటర్ గా పేరు తెచ్చుకోవడంతో పాటు తన కొడుకు రాజమౌళి కెరీర్ పరంగా ఎదగటానికి తన వంతు సహాయం చేశారు.

తాజాగా విజయేంద్ర ప్రసాద్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించడం గమనార్హం.వసంత కోకిల సినిమా( Vasantha Kokila movie ) స్పూర్తితో సింహాద్రి మూవీ ఇంటర్వల్ సీన్ ను ప్లాన్ చేశామని ఆయన అన్నారు.బాహుబలి2 లో కట్టప్పను చంపాలని శివగామి చెబుతుందని అందులో కట్టప్ప నువ్వు చంపుతావా? నేను చంపనా? అని శివగామి చెబుతుందని ఆ డైలాగ్ నాది కాదని రాజమౌళిదని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.కట్టప్ప తాను చనిపోయినా శివగామి బాహుబలిని చంపుతుందని అందుకే చంపాడని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

బాహుబలి1 విడుదలైన తర్వాత బాహుబలి2 కు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయని ఆయన అన్నారు.తిరుపతిలో ఆడియో ఫంక్షన్ చేయగా అడివి శేష్( Adivi Sesh ) పవన్ పేరు చెప్పిన వెంటనే పవర్ స్టార్ అని కేకలు వేశారని ఎంత చెప్పినా ఆపడం లేదని ఆయన అన్నారు.ప్రభాస్ ఫంక్షన్ లో పవన్ పేరు అరవడంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యామని ఆయన తెలిపారు.

అయితే అలా జరగడం వల్లే బాహుబలి2( Bahubali 2 ) లో సీన్ ను డిజైన్ చేశామని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

Advertisement

ఎక్కడ ఏది చూసినా ఆలోచించే గుణం ఉండాలని ఆయన కామెంట్లు చేశారు.విజయేంద్ర ప్రసాద్ అన్నారు.విజయేంద్ర ప్రసాద్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయేంద్ర ప్రసాద్ పారితోషికం భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.విజయేంద్ర ప్రసాద్ కు క్రేజ్ పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు