రాజమౌళి 12 సినిమాల్లో ఉండే వైవిద్యం గురించి తెలుసా.. ?

టాలీవుడ్ లోనే కాదు భారతీయ సినిమా పరిశ్రమలోనే దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి.

బాహుబలి సినిమా ద్వారా ప్రపంచానికి భారతీయ సినిమా సత్తా ఏంటో చూపిన వాడు.

ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతేకాదు అంతకు ముందు ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమా హిట్ అయ్యింది.

అందుకే రాజమౌళితో సినిమాలు చేసేందుకు పలువురు హీరోలు ఎదురు చూస్తుంటారు.ఆయన ఇప్పటి వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించగా అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి.

అయితే ఈ 12 సినిమాల్లోని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టూడెంట్ నెంబర్.1

2001లో విడుదల అయిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, గజాల హీరో, హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా ద్వారా హీరోగా ఎన్టీఆర్, దర్శకుడిగా రాజమౌళి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement
Rajamouli Differentiation In His 12 Movies, Rajamouli Movies , Chtra Pathi , Hit

వీరిద్దరికి ఈ సినిమా మైల్ స్టోన్ గా చెప్పుకోవచ్చు.

సింహాద్రి

భూమిక, జూ.

ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.అంతేకాదు.

వీరిద్దరి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

సై

నితిన్, జెనీలియా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.2004లో వచ్చిన ఈ సినిమా రగ్బీ గేమ్ ఆటచుట్టూ తిరుగుతుంది.

Rajamouli Differentiation In His 12 Movies, Rajamouli Movies , Chtra Pathi , Hit

చత్రపతి

2005లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్, శ్రియ నటించారు.ఈ సినిమా ద్వారా ప్రభాస్ కు ఓ రేంజిలో గుర్తింపు వచ్చింది.అంతేకాదు.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

ఈ సినిమా ఘన విజయం సాధించింది.

Advertisement

విక్రమార్కుడు

2006లో వచ్చిన ఈ సినిమాలో రవితేజ, అనుష్క కలిసి నటించారు.పోలీస్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది.కామెడీ ఎటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

యమదొంగ

ప్రియమణి, ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా మంచి విక్టరీ కొట్టింది.2007లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ అచ్చంత తన తాతలా నటించి ఆకట్టుకున్నాడు.రాజమౌళికి సైతం ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది.

మగధీర

రామ్ చరణ్, కాజల్ నటించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.

జాతీయ స్థాయిలో

గుర్తింపు పొందింది ఈ సినిమా.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీగా వసూళ్లు సైతం సాధించిది.

మర్యాద రామన్న

2010లో వచ్చిన ఈ సినిమాలో సునీల్, సలోని జంటగా నటించారు.హాస్య నటుడిని హీరోగా పెట్టి హిట్ కొట్టాడు రాజమౌళి.

ఈగ

సమంత, నాని నటించిన ఈ సినిమా 2012లో రీలీజ్ అయ్యింది.

ఒక ఈగ చుట్టూ తిప్పుతూ అల్లిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

బాహుబలి

2015లో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క, రానా కలిసి నటించారు.ఈ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాడు రాజమౌళి.

బాహుబలి-2

బాహుబలి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలకు వచ్చిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఆర్ఆర్ఆర్

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ సినిమా 13 అక్టోబర్ 2021లో విడుదల కానుంది.

అల్లూరి, కొమురం భీమ్ జీవిత కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజా వార్తలు