స్టాండప్ రాహుల్ అనే టైటిల్ తో వస్తున్న రాజ్ తరుణ్

కుర్ర హీరో రాజ్ తరుణ్ ఈ మధ్య వరుస డిజాస్టర్ సినిమాలతో రేస్ లో బాగా వెనుకబడిపోయాడు.

అయినా కూడా అతనితో సినిమాలు చేయడానికి దర్శక, నిర్మాతలు ముందుకొస్తున్నారు.

ప్రస్తుతం రాజ్ తరుణ్ చేతిలో ఏకంగా నాలుగు నుంచి ఐదు సినిమాల వరకు ఉన్నాయి.వీటిలో ఒక్కటి సక్సెస్ అయినా మళ్ళీ అతను రేస్ లోకి వచ్చేస్తాడు.

అతని టాలెంట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు.అయితే కథల ఎంపిక సరిగ్గా లేకపోవడం వలన సరైన హిట్స్ అందుకోలేకపోతున్నాడు అనే అభిప్రాయం ఉంది.

కంటెంట్ బేస్ సినిమాలు నమ్ముకుంటే రాజ్ తరుణ్ కెరియర్ కి తిరుగుండదు అనే మాట వినిపిస్తుంది.ఇప్పుడు అతని సినిమాల ఎంపిక అలాగే ఉండబోతుంది అని తెలుస్తుంది.

Advertisement

అయితే తన సినిమాలలో ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే కొత్తదనం ఉన్న కథలు చేయాలని రాజ్ తరుణ్ అనుకుంటున్నారు.అందులో భాగంగా శాండీ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకి ఒకే చెప్పేశాడు.

దీనికి కాస్తా వెరైటీ టైటిల్ ని ఫిక్స్ చేశారు.చిన్న వయస్సులో స్కూల్ లో తప్పు చేస్తే స్టాండప్ అని టీచర్స్ అనే వారు ,ఇప్పుడు అదే టైటిల్ ని రాజ్ తరుణ్ సినిమాకి ఖారారు చేశారు.

స్టాండప్ రాహుల్ ఈ సినిమా టైటిల్.టైటిల్ తోనే కాస్తా క్రియేటివ్ గా ఆలోచించి పెట్టిన దర్శకుడు కంటెంట్ ని కూడా కామెడీ ఎంటెర్టైనర్ గా ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాలో వ‌ర్ష బొల్ల‌మ్మ క‌థానాయికగా నటిస్తుంది‌.ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుగుతోంది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

స్వీకార్అగ‌స్తీ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు