అలిపిరి మెట్ల మార్గం ద్వారా శ్రీవారి దర్శనంకి వెళ్తున్న రాహుల్!

ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏపీ పర్యటనలో భాగంగా తిరుపతి చేరుకొని, అలిపిరిలో మెట్ల మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేస్తున్న ప్రత్యెక హోదా భరోసా యాత్రని మొదలు పెట్టాడానికి వచ్చిన రాహుల్ గాంధీ ముందుగా శ్రీవారి దర్శనం చేసుకొని మొక్కు మొక్కుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఇందులో భాగంగా రాహుల్ గాంధీ ఊహించని విధంగా కాలినడగా మార్గం ద్వారా శ్రీవారి దర్శనం కి వెళ్తున్నారు.ఇక శ్రీవారి దర్శనం అనంతరం సాయంత్రం జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించడంతో పాటు, ప్రధాని మోడీ ఏపీకి చేసిన అన్యాయంపై గళం వినిపిస్తారని తెలుస్తుంది.

గతంలో మోడీ ప్రత్యెక హోదాపై హామీ ఇచ్చిన సభా ప్రాంగణంలోనే రాహుల్ కూడా సభని ఏర్పాటు చేయించి ఏపీ ప్రజలకి ప్రత్యెక హోదాపై హామీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపించడంతో పాటు, విభజన హామీల అమలుకి భరోసా ఇచ్చే అవకాశం వుందని తెలుస్తుంది.

రాహుల్ పర్యటన తర్వాత ఏపీ ప్రజలకి కాంగ్రెస్ మీద విశ్వాసం పెరిగే అవకాశం వుందని, ఓటు బ్యాంకు పెరిగే అవకాశం కూడా ఉంటుందని ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా విశ్వసిస్తున్నారు.మరి రాహుల్ పర్యటన కాంగ్రెస్ పార్టీకి ఎంత వరకు లాభిస్తుంది అనేది చూడాలి.

Advertisement
షాకిచ్చిన అనితా ఆనంద్ ... కెనడా ప్రధాని రేసు నుంచి ఔట్

తాజా వార్తలు