వైయస్ షర్మిల ఇడుపులపాయ టూర్ లో రఘువీరా రెడ్డి కీలక వ్యాఖ్యలు..!!

ఆదివారం ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు వైయస్ షర్మిల( YS Sharmila ) స్వీకరించనున్నారు.

ఈ క్రమంలో శనివారం ఇడుపులపాయలో( Idupulapaya ) వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించడం జరిగింది.

వైయస్ షర్మిల వెంట ఏపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు కేవీపీ రామచంద్రరావు, శైలజానాథ్, తులసి రెడ్డి, రఘువీరా రెడ్డి ఉన్నారు.ఈ సందర్భంగా రఘువీరారెడ్డి( Raghuveera Reddy ) మీడియాతో మాట్లాడుతూ.

వైయస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీనీ దేశ ప్రధాని చేయటానికి.

వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం శుభపరిణామం అని అన్నారు.ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాజశేఖరరెడ్డి ఎంతో దోహదపడ్డారు.మళ్లీ అటువంటి బాధ్యత వైఎస్ షర్మిల తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని చెప్పుకొచ్చారు.

Advertisement

ఈ క్రమంలో వైయస్ షర్మిలకి అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పజెప్పటం పట్ల మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు రఘువీరారెడ్డి తెలియజేయడం జరిగింది.పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపాలి.

ఈ రాష్ట్రం యొక్క హక్కులు సాధించుకోవాలి.రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ప్రధాని అవ్వడం కోసం వైఎస్ షర్మిల వేసిన అడుగులకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajashekar Reddy ) ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు రఘువీరా రెడ్డి పేర్కొన్నారు.ఈ క్రమంలో పార్టీలో జాయిన్ అయిన అహ్మదుల్లానీ అభినందించారు.

ఇది ప్రారంభం కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి చేయి చేయి కలపడానికి కష్టపడి పని చేయడానికి తాము అంత సిద్దంగా ఉన్నట్లు స్పీచ్ ఇచ్చారు.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 
Advertisement

తాజా వార్తలు