మద్యం ప్రియులకు షాక్.. రానున్న రెండు రోజుల్లో...?

మద్యం ప్రియులకు షాక్.రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు వైన్ షాపులు మూతపడనున్నాయంట.

ఇది మందుబాబులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు.కానీ ఎందుకు.? ఎక్కడ.? అనుకుంటున్నారా.? అయితే చూసేయండి.మద్యం షాపులు మూత పడతాయనగానే మందుబాబుల గుండెల్లో రాయి పడ్డట్లు అవుతుంది.

అమ్మో ఇదేంటి? వైన్ దుకాణాలు బంద్ అయితే ఎలా.? ఇప్పుడు గాంధీ జయంతి కూడా లేదు కదా.ఎన్నికలు లేవు.మరి ఎందుకు బ్యాడ్ న్యూస్ అని ఆలోచనలో పడిపోతుంటారు.

మరోవైపు మద్యంపై నిషేధం విధిస్తే ఎలా.? ఇంకేమైనా ఉందా? అని భయపడిపోతుంటారు.అదే క్రమంలో ఆదాయ వనరుగా ఉన్న మందును బ్యాన్ చేసి ప్రభుత్వాలు నడవగలవా అని తమను తామే సముదాయించుకుంటుంటారు.

Advertisement

సాధారణంగా ఎన్నికలు నిర్వహించే సమయాలలో, కౌంటింగ్ రోజున, గాంధీ జయంతితో పాటు మరికొన్ని ప్రత్యేక సందర్భాలలో మద్యం దుకాణాలను మూసివేస్తారు.అదేవిధంగా హోలీ పండుగ సందర్భంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులను బంద్ చేస్తారు.

హోలీ పండుగను పల్లెల నుంచి పట్టణాల వరకు ఎంతో ఘనంగా జరుపుకుంటారు.కరోనా మహామ్మారి కారణంగా గత కొన్నేళ్లుగా హోలీ కళ తప్పింది.

ఈ ఏడాది ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు ప్రజలంతా రంగుల్లో మునిగి తేలుతారని చెప్పొచ్చు.ఈ క్రమంలోనే హోలీ పండుగను దృష్టిలో పెట్టుకొని పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలకు రంగం సిద్ధం చేసింది.

ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదన్న ఉద్దేశ్యంతో జంటనగరాల్లోని వైన్ షాపులను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.దీంతో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

ఈ క్రమంలోనే మార్చి 6 సాయంత్రం 6 గంటల నుంచి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు.ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ కీలక ఆదేశాలు ఇచ్చారు.తమ ఆజ్ఞలను కాదని నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Advertisement

అదేవిధంగా మద్యం సేవించి బహిరంగ ప్రదేశాలలో వివాదాలు సృష్టించిన వారిపై కూడా చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు.

తాజా వార్తలు