Nayanthara : ఆ సినిమా వద్దని రిజెక్ట్ చేసిన నయనతార.. బంపర్ ఆఫర్ అందుకున్న రాశి ఖన్నా?

లేడీ సూపర్ స్టార్ నయనతార ( Nayanthara )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నయనతార ప్రస్తుతం కోలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది నయనతార.కాగా ఈమె గత ఏడాది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ( Vignesh Sivan )ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

పెళ్లి అయినప్పటికీ అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.

Raashi Khanna Got Bumper Offer Because Of Nayanthara

కేవలం హీరోయిన్ గా సినిమాలలో నటించడం మాత్రమే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మిస్తోంది.ఈ దంపతులకు కవల పిల్లలు కూడా జన్మించిన విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం నయన్ బ్యాక్‌ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తోంది.

Advertisement
Raashi Khanna Got Bumper Offer Because Of Nayanthara-Nayanthara : ఆ సిన

ప్రస్తుతం నయనతార చేతిలో దాదాపుగా 9 ప్రాజెక్టులు ఉన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నయనతార కి సంబంధించిన వార్త చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే నయనతార చేసిన పనికి రాశీ ఖన్నా( Rashi Khanna ) కు బంపర్ ఆఫర్ వచ్చింది.

Raashi Khanna Got Bumper Offer Because Of Nayanthara

నయనతార తమిళంలో వైనాట్‌ శశికాంత్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాలో మొదట హీరోయిన్‌గా ఎంపిక అయ్యింది.అది లేడీ ఓరియెంటెడ్‌ సినిమా.ఇందులో మాధవన్‌, సిద్ధార్థ్‌( Madhavan, Siddharth ) ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఇటీవల అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

కానీ కొన్ని కారణాల వల్ల నయనతార ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ ఆఫర్ రాశీఖన్నా కు వచ్చింది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇందులో హీరోయిన్ పాత్రకే ఎక్కువగా నిడివి ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాకు ది టెస్ట్( The Test ) అనే టైటిల్ ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.ఒకవైపు రాశి కన్నా కి బంపర్ ఆఫర్ వచ్చింది అంటూ వార్తలు వినిపిస్తుండగా మరోవైపు ఈ సినిమాలో రాశి కన్నాతో పాటు నయనతార కూడా నటించబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

వార్తల్లో నిజా నిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే మరి.

తాజా వార్తలు