పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు నాణ్యమైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( District Collector Anurag Jayanthi ) ఆదేశించారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఔట్ పేషెంట్ వార్డు, ల్యాబ్, మెటర్నిటీ వార్డు, రేడియాలజీ గది, ఫార్మసీ, మాతృసేవా కార్యక్రమం అమలు తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఔట్ పేషెంట్ వార్డులోని విభాగాల వారీగా అన్ని గదులలో ఏమైనా పరికరాలు తక్కువగా ఉన్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని సంబంధిత వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.పేషెంట్లకు వారు అందిస్తున్న వైద్య సేవల తీరును కలెక్టర్ ఆరా తీశారు.

ఓపి రిజిస్ట్రేషన్( OP Registration ) కు సంబంధించి ప్రస్తుతం ఉన్న సాఫ్ట్ వేర్ ను డెవలప్ చేసి నూతనంగా పొందుపర్చాల్సిన అంశాలపై చర్చించాలని సూచించారు.ముఖ్యంగా ల్యాబ్ లో అవసరమైన పరికరాలకు సంబంధించి ఒక నివేదిక ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.

నిర్ధారణ కోసం టీ హబ్ కు పంపించే శాంపిల్స్ కు సంబంధించిన రిపోర్టులు తొందరగా వచ్చే విధంగా చూడాలని అన్నారు.అందరికీ అర్థమయ్యే విధంగా ప్రతీ విభాగం, వార్డు వద్ద పెద్ద అక్షరాలతో కూడిన నేమ్ బోర్డులు అమర్చాలని సూచించారు.

Advertisement

మాతృసేవా కార్యక్రమాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలని అన్నారు.గర్భిణీ స్త్రీలకు( Pregnant Women ) ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

ఈ పరిశీలనలో ఇంచార్జి సూపరింటెండెంట్ డా.సుగుణ శోభారాణి, ఆర్ఎంఓ డా.సంతోష్, హెల్త్ సర్వీస్ జిల్లా కో ఆర్డినేటర్ డా.మురళీధర్ రావు, తదితరులు ఉన్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News