మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్( Fahadh Faasil ) గురించి మనందరికీ తెలిసిందే.
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాతో( Pushpa ) భారీగా పాపులారిటీని సంపాదించుకున్నారు.
అయితే పార్ట్ వన్ లో కనిపించినది అరగంట సేపు మాత్రమే అయినప్పటికీ తన నటనతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు.ఆ తరువాత వచ్చిన కమల్ హాసన్ విక్రమ్ మూవీలో( Vikram ) కూడా నటించి మెప్పించారు.
దీంతో ఫహద్ యాక్టింగ్ కి ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు.ఇక అప్పటినుంచి ఫహద్ నటించిన పలు సినిమాలను డబ్బింగ్ తో ఓటీటీలు ద్వారా ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.
దీంతో ఫహద్ నటించే కొత్త సినిమాలను కూడా టాలీవుడ్ లో రిలీజ్ చేసేలా తెలుగు టచ్ ఉండేలా చూసుకుంటున్నారు.ఈక్రమంలోనే ఫహద్ నటించే కొత్త సినిమాని ఆంధ్రప్రదేశ్ ప్రొద్దుటూరు లో( Proddatur ) చిత్రీకరిస్తున్నారు.ఈ సినిమాలో ఫహద్ తో పాటు మన తెలుగు నటుడు కృష్ణుడు కూడా నటిస్తున్నారు.
ఈ సినిమాలోని ఒక హోటల్ సన్నివేశాన్ని ప్రొద్దుటూరు సెంటర్ లో చిత్రీకరిస్తుండగా కొంతమంది ఆ షూటింగ్ ని( Shooting ) వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.హోటల్ లో భోజనం చేసిన ఫహద్ అండ్ టీం.అక్కడి నుంచి ఒక ఆటో ఎక్కి బయలుదేరారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఆ వీడియో పై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు.ఇకపోతే ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం పుష్ప 2 లో( Pushpa 2 ) నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఫహద్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు.
అల్లు అర్జున్( Allu Arjun ) ఫహద్ ఫాజిల్ మధ్య జరిగే పోరాటం ఒక రేంజ్ లో ఉంటుందని, ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుందని మేకర్స్ చెబుతున్నారు.కాగా పుష్ప 2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy