దసరా తర్వాత బ్యాంకాక్ లో ఫైటర్ స్టార్ట్ చేయబోతున్న పూరి

ఇస్మార్ట్ శంకర్ తో జోరు మీద ఉన్న పూరి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా స్టార్ట్ చేశాడు.

తరువాత ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి రెడీ కావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కాస్తా లేట్ అయ్యింది.

తరువాత ముంబైలో నలభై రోజుల పాటు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు.ఆ తరువాత మరల షూటింగ్ కి రెడీ అయ్యే సమయంలో లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

Puri Plan To Start Fighter Shooting After Dasara Festival, Tollywood, Bollywood,

మరల ఇప్పుడు లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.అయితే ముందుగా పూరి ముంబైలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

కానీ అక్కడ కరోనా పరిస్థితి కాస్తా ప్రమాదకరంగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకున్న వచ్చే ప్రమాదం ఉందని ముంబై షెడ్యూల్ లో హోల్డ్ లో పెట్టారు.ఇప్పుడు బ్యాంకాక్ షెడ్యూల్ లో స్టార్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది.

Advertisement

యూరప్ హాలిడేకి వెళ్లి విజయ్ దేవరకొండ కూడా తిరిగి వచ్చేయడంతో షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పూరి టీం ఉంది.దసరా వెళ్లిన వెంటనే గాని లేదంటే వచ్చే నెల మొదటి వారంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఈ షెడ్యూల్ లో మెజారిటీ షూటింగ్ ఫినిష్ చేసి చివర్లో ముంబై షెడ్యూల్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

అలాగే బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.

బాక్సింగ్ కథకి పూరి మార్క్ మాఫియాని జోడించి ఈ కథని సిద్ధం చేసాడని టాక్ నడుస్తుంది.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు