మా రాష్ట్రం నుంచి అమెరికాకు డైరెక్ట్ ఫ్లైట్ నడపండి.. సింధియాను కోరిన పంజాబ్ ఎన్ఆర్ఐ మంత్రి

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి

జ్యోతిరాదిత్య సింధియాతో

పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్‌ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కెనడా, అమెరికాలకు పంజాబ్ నుంచి నేరుగా విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకురావాలని ధాలివాల్ కోరారు.

ఈ మేరకు జ్యోతిరాదిత్య సింధియాకు ఆయన వినతిపత్రం అందజేశారు.కెనడా, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్ , చికాగో, సీటెల్, శాన్‌ఫ్రాన్సిస్కోలకు .అమృత్‌సర్, మొహాలీల నుంచి డైరెక్ట్ ఫ్లైట్ నడపాలని కుల్‌దీప్ విజ్ఞప్తి చేశారు.ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఇరువైపులా ప్రయాణీకులు భారీగా లబ్ధిపొందుతారని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు.

పంజాబ్‌కు చెందిన ప్రవాస భారతీయులు, పంజాబ్ మూలాలున్న వారు కెనడా, అమెరికాలలో పెద్ద సంఖ్యలో వున్నారని కేంద్రమంత్రి దృష్టికి కుల్‌దీప్ తీసుకెళ్లారు.ఈ దేశాల్లో నివసిస్తున్న పంజాబీ కమ్యూనిటీని డైరెక్ట్ ఫ్లైట్ సమస్య ధీర్ఘకాలంగా వేధిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా సింధియాను ధాలివాల్ కోరారు.

Punjab Nri Affairs Minister Kuldeep Dhaliwal Turns To Centre For Direct Flights
Advertisement
Punjab NRI Affairs Minister Kuldeep Dhaliwal Turns To Centre For Direct Flights

గతేడాది డిసెంబర్‌లో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐదు ‘ఎన్ఆర్ఐ పంజాబియన్ నల్ మిల్నీ’ కార్యక్రమాలు నిర్వహించినట్లు ధాలివాల్ అన్నారు.ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు లేవనెత్తిన ప్రధాన సమస్యల్లో యూఎస్, కెనడాలలోని ప్రధాన నగరాల నుంచి పంజాబ్‌కు డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడం కూడా ఒకటని కుల్‌దీప్ పేర్కొన్నారు.అమెరికా, కెనడాల నుంచి అన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ న్యూఢిల్లీ వరకు వున్నందున పంజాబ్‌కు వచ్చే వారు మరో కనెక్టింగ్ ఫ్లైట్‌లో లేదా టాక్సీలో రాష్ట్రానికి రావాల్సి వస్తోందని ఆయన సింధియాను కలిసిన అనంతరం మీడియాతో వ్యాఖ్యానించారు.

Punjab Nri Affairs Minister Kuldeep Dhaliwal Turns To Centre For Direct Flights

అందుబాటులో వున్న డేటాను బట్టి.భారత్ నుంచి టొరంటోకి ఏడాదికి ఐదు లక్షల మంది రాకపోకలు సాగిస్తూ వుంటారని అంచనా.వీరిలో ఎక్కువమంది పంజాబీలే.

కెనడా- భారత్‌లోని అమృత్‌సర్‌ల మధ్య నేరుగా విమాన సర్వీసులు లేవు.అటు నుంచి ఇటు రావాలన్నా.

ఇటు నుంచి అటు వెళ్లాలన్నా మధ్యలో విమానాలు మారాల్సి వస్తోందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు