బిగ్ బాస్ సీజన్ 4 బోల్డ్ బ్యూటీ అరియానా అటు సోషల్ మీడియాలో, ఇటు బుల్లితెరలో ఓ రేంజ్ లో హడావుడి చేస్తుంది.బిగ్ బాస్ తర్వాత ఎనలేని క్రేజ్ ను సంపాదించుకొని సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.
మొదట తన కెరీర్ ను యూట్యూబ్ లో యాంకర్ గా మొదలు పెట్టింది.అలా ఓసారి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేయగా.
ఆమెపై వర్మ చేసిన బోల్డ్ కామెంట్లతో సెలబ్రిటీగా మారింది.
అలా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో అవకాశం అందుకుంది.
ఇక అందులో తన పరిచయాన్ని మరింత పెంచుకుంది.ఎంట్రీ తోనే బాగా వైలెంట్ గా నిలిచింది.
అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో మరో కంటెస్టెంట్ సోహెల్ తో బద్ధశత్రువుగా ఉండేది.చివరి కొన్ని రోజుల్లో మంచి ఫ్రెండ్స్ గా మారారు.
అలా హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరి మధ్య ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది.
ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్లేవాళ్లు.
ఇక సోషల్ మీడియాలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా బాగా పంచుకునే వాళ్ళు.ఆ తర్వాత ఇద్దరు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల కాస్త దూరంగా ఉంటున్నారు.
ఇక అరియానా షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి పేరు సంపాదించుకుంది.అంతేకాకుండా బిగ్బాస్ బజ్ లో కూడా కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసింది.
ఆ తర్వాత బుల్లితెరపై తనకు పలు షోలలో అవకాశాలు కూడా వచ్చాయి.మళ్లీ నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా అవకాశం అందుకోగా అందులో బాగా రెచ్చిపోయింది.ఈ షో తర్వాత ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది.అషు రెడ్డి తో పరిచయం పెంచుకొని అచ్చం తనలాగే తయారయ్యింది.ఇక అషు లాగే పొట్టి పొట్టి బట్టలు వేస్తూ.జనాలతో నెగటివ్ కామెంట్లు ఎదుర్కొంది.
అయినా కూడా అవేవి పట్టించుకోకుండా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఎద నుండి థైస్ వరకు అందాలన్నీ చూపిస్తూ రెచ్చగొడుతుంది.ఇక ప్రస్తుతం ఆమె బిబి జోడి లో డాన్సర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.
అందులో మరో కమెడియన్ ముక్కు అవినాష్ తో కలిసి బాగా డాన్స్ చేస్తూ అందర్నీ మెప్పిస్తుంది.అయితే తాజాగా ఆమెకు ముక్కు అవినాష్ వల్ల ఒక చిన్న గాయం అయింది.
దానికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ రూపంలో పంచుకుంది.అందులో తను కారులో కూర్చొని ఉండగా.తన చేతికి అయిన గాయాన్ని చూపిస్తూ.చూడండి అవినాష్ గారు.బిబి జోడిలో డాన్స్ పెర్ఫార్మెన్స్ లో మీ పక్కనున్న ఆర్టిస్టును పట్టించుకోకుండా డాన్స్ పెర్ఫార్మెన్స్ తో మీ 100% డేడికేషన్ తో అవతలి వాళ్ళు ఎలా బలవుతున్నారో చూడండి అంటూ.తన చేతికి బాగా కమిలిపోయి ఉన్న గాయాన్ని చూపించింది.
ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ గా మారింది.