అసిస్టెంట్ కి సర్ ప్రైజ్ ఇచ్చిన గోపీచంద్..!

మాచో హీరో గోపీచంద్ తన అసిస్టెంట్ ఇంటి గృహ ప్రవేశానికి అతిథిగా వెళ్లారు.

గోపీచంద్ కి ఎన్నో ఏళ్ల నుంచి పిఏ గా ఉంటున్న శ్రీను కొత్త ఇంటిని కట్టుకున్నాడు.

ఆ ఇంటి గృహ ప్రవేశానికి గోపీచంద్ అటెండ్ అయ్యారు.గోపీచంద్ రావడంతో అక్కడ అంతా సందడి వాతావరణం ఏర్పడింది.

అంతేకాదు అసిస్టెంట్ కు గోపీచంద్ విలువైన బహుమతి కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది.ఆ ఇంటి నిర్మాణంలో కూడా గోపీచంద్ కొంత మొత్తం ఆర్ధిక సాయం అందించారని తెలుస్తుంది.

తమ దగ్గర ఉన్న అసిస్టెంట్ లను ప్రేమతో తమ ఫ్యామిలీ మెంబర్ లా చూసుకుంటారు సెలబ్రిటీస్.అలాంటి వారిలో గోపీచంద్ ఒకరని అంటుంటారు.

Advertisement

గోపీచంద్ మంచి మనసున్న వ్యక్తి అని అందరికి తెలిసిందే.ఈమధ్యనే ఆయన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో కనిపించారు.

ప్రస్తుతం రామబాణం సినిమా చేస్తున్న గోపీచంద్ ఆ సినిమాతో మరోసారి తన మాస్ ఫ్యాన్స్ ని అలరించాలని చూస్తున్నారు.గోపీచంద్ మార్క్ సినిమా కోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

శ్రీవాస్ డైరెక్షన్ లో వస్తున్న రామబాణం సినిమా మీద గోపీచంద్ చాలా నమ్మకం పెట్టుకున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు