తారకరత్న అలేఖ్యారెడ్డి జాతకంలో అలా ఉంది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన ప్రసన్న కుమార్ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

తారకరత్న అలేఖ్యారెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు.

పార్టీల పరంగా వేరు అయినా ఆ రెండు కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని నిర్మాత తెలిపారు.ఫ్యామిలీ పర్సన్స్ లా వాళ్లు బిహేవ్ చేశారని ఆయన వెల్లడించడం గమనార్హం.

తారకరత్న అలేఖ్యారెడ్డి జాతకాలు చూపించిన సమయంలో గ్రామ దేవత లేక కుల దేవతకు పూజలు చేయాలని వాళ్లు చెప్పారని ఆయన కామెంట్లు చేశారు.నందమూరి వాళ్ల కుల దేవత నాయకమ్మ అని ప్రసన్న కుమార్ పేర్కొన్నారు.

ఈ కుల దేవత వల్లే అక్కడ మశూచి పోయిందని ఆయన తెలిపారు.భర్తను పోగొట్టుకోవాలని ఏ భార్య కూడా కోరుకోదని ప్రసన్న కుమార్ కామెంట్లు చేశారు.

Advertisement

తారకరత్న అలేఖ్యల మధ్య చిన్నచిన్న గొడవలు ఉండవచ్చని అవి మరీ పెద్దవి అయితే కావని ఆయన తెలిపారు.విధి ప్రకారమే ఏదైనా జరుగుతుందని ప్రసన్న కుమార్ అన్నారు.అలేఖ్య ఆ బాధ నుంచి మెల్లగా కోలుంటున్నారని ఆయన కామెంట్లు చేశారు.

చనిపోయిన తర్వాత కూడా వాళ్ల పేరు మంచి వినిపిస్తుంటే ఆ పేర్లకు సార్థకత ఉంటుందని ప్రసన్న కుమార్ చెప్పుకొచ్చారు.

ఆ బాధ అనేది ఎవరికైనా ఉంటుందని ప్రసన్న కుమార్ కామెంట్లు చేశారు.ప్రసన్న కుమార్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అలేఖ్య ఈ బాధ నుంచి త్వరగా కోలుకుని సాధారణ మనిషి కావాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అలేఖ్య సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.అలేఖ్య సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

అలేఖ్య రాజకీయాల్లోకి వస్తారని వినిపిస్తుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు