'సలార్' యూనివర్సల్ ట్రైలర్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తుంటే అంత లేట్ అవుతున్నాయి.

ఎన్నో వాయిదాల తర్వాత రిలీజ్ అయిన ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అయ్యింది.

ఇక ఈ సినిమా ప్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోయే సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ప్రభాస్ లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉండగా అన్ని కూడా వేటికవే అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.

మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో సలార్( Salaar ) ఒకటి.సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.

అన్నీ అనుకున్న విధంగానే జరిగినట్లయితే సలార్ సెప్టెంబర్ 28నే రిలీజ్ అయ్యేది.కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.ఇక మేకర్స్ క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామని తెలిపారు.

Advertisement

మరి ఇంకా ఈ సినిమా రిలీజ్ కు నెల రోజుల సమయమే ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టినట్టు టాక్.

ఈ సినిమా నుండి ట్రైలర్ వచ్చే అవకాశం ఉంది.దీంతో ఈ ట్రైలర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంత ఎదురు చూస్తున్నారు.మరి ఈ ట్రైలర్ కట్ పై ఒక న్యూస్ నిన్నటి నుండి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

పాన్ ఇండియా లెవల్లో ఒకే ట్రైలర్ రాబోతుందని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.మరి ఈ యూనివర్సల్ ట్రైలర్ ను సింపుల్ గా ఇంగ్లీష్ లో రెడీ చేసే ఆలోచనలో నీల్ ఉన్నారని టాక్ రాగ దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ట్రైలర్ విషయంలో అలాంటిది ఏమీ లేదని ఒకవేళ ఎమన్నా ఉంటే అప్డేట్ ఇస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. సో సలార్ ఒక్క బాషలోనే రిలీజ్ అయ్యేది అనేది అవాస్తవం అనే చెప్పాలి.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

కాగా ఈ సినిమాలో శృతి హాసన్ ( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.

తాజా వార్తలు