ఆ స్టార్ డైరెక్టర్ డైలాగ్స్ అంటే ప్రభాస్ కు చాలా ఇష్టమట.. ఫ్లాపులిచ్చినా మారలేదుగా!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభాస్ (Prabhas)సినిమా అంటే సులువుగా 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధిస్తుంది.

అయితే ఎంతోమంది స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించిన ప్రభాస్ కు పూరీ జగన్నాథ్ (Puri Jagannath)డైలాగ్స్ అంటే ఎంతో ఇష్టమట.ప్రభాస్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ (Bujjigadu, Ek Niranjan)సినిమాలు తెరకెక్కాయి.

అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.పూరీ జగన్నాథ్ ప్రభాస్ కు ఫ్లాపులిచ్చినా ప్రభాస్ దృష్టిలో పూరీ జగన్నాథ్ పై ఒపీనియన్ మారలేదనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో మరో సినిమా తెరకెక్కుతుందేమో చూడాలి.వరుస ఫ్లాపుల వల్ల పూరీ జగన్నాథ్ కు కొత్త ఆఫర్లు రావడం కష్టమవుతోంది.

Prabhas Comments About Tollywood Star Director Details Inside Goes Viral In Soci
Advertisement
Prabhas Comments About Tollywood Star Director Details Inside Goes Viral In Soci

ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు.ది రాజాసాబ్, సలార్2, స్పిరిట్(The Rajasab, Salar2, Spirit), ప్రభాస్ హను రాఘవపూడి కాంబో మూవీ ఫౌజీపై కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ప్రభాస్ నటిస్తున్న నాలుగు సినిమాల బడ్జెట్ దాదాపుగా 2000 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

ప్రభాస్ తన సినిమాల అప్ డేట్స్ విషయంలో సైతం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Prabhas Comments About Tollywood Star Director Details Inside Goes Viral In Soci

ప్రభాస్ కథల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.వేర్వేరు జానర్ల బ్యాక్ డ్రాప్ సినిమాలలో నటిస్తుండటం ప్రభాస్ కు ప్లస్ అవుతోంది.ప్రభాస్ రెమ్యునరేషన్(Prabhas Remuneration) 80 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇతర భాషల్లో సైతం ప్రభాస్ కు రికార్డ్ స్థాయిలో మార్కెట్ ఉందనే సంగతి తెలిసిందే.

అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!
Advertisement

తాజా వార్తలు