పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించినా సక్సెస్ కాని హీరోయిన్లు వీళ్లే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఆశ పడుతున్న స్టార్ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు.

పవన్ తో నటించడం ద్వారా తమకు క్రేజ్, గుర్తింపు మరింత పెరుగుతుందని ఈ హీరోయిన్లు భావిస్తున్నారు.

అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం పవన్ కళ్యాణ్ తో నటించినా జాతకాలను మార్చుకోలేకపోయారు.అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కు జోడీగా సుప్రియ నటించగా ఈ సినిమా తర్వాత ఆమెకు కొత్తగా ఆఫర్లు రాలేదు.

పవన్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటైన సుస్వాగతం సినిమాలో పవన్ కు జోడీగా దేవయాని నటించగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకున్నా దేవయాని జాతకం మారలేదు.తొలిప్రేమ సినిమాలో పవన్ కు జోడీగా కీర్తి రెడ్డి నటించగా ఈ సినిమా సక్సెస్ సాధించినా కీర్తి రెడ్డి ఎక్కువ కాలం సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించలేకపోయారనే సంగతి తెలిసిందే.

ప్రీతి జింగానియా కూడా తమ్ముడు మూవీలో పవన్ కు జోడీగా నటించినా కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ కాలేదు.

Advertisement

బద్రి సినిమాలో రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించగా ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా బ్యాడ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేయడంలో ఫెయిల్ అయ్యారు.అమీషా పటేల్, మీరా జాస్మిన్, మీరా చోప్రా నికిషా పటేల్, అను ఇమ్మాన్యుయేల్ కూడా కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోలేక ఇండస్ట్రీకి దూరమయ్యారు.సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

పవన్ తర్వాత సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో ఊహించని స్థాయిలో అంచనాలతో తెరకెక్కుతున్నాయి.ఈ సినిమాలు కూడా సక్సెస్ సాధించి పవన్ కళ్యాణ్ రేంజ్ ను మరింత పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.

హరిహర వీరమల్లు, వినోదయ సిత్తం రీమేక్, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలతో పాటు పవన్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 
Advertisement

తాజా వార్తలు