సర్ప్రైజ్ ఇచ్చిన బుట్టబొమ్మ.. ఆనందంలో హరీష్ శంకర్..!

పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతూ బుట్టబొమ్మ పూజ హెగ్డే అందరికి సర్ప్రైజ్ ఇచ్చే పనిలో ఉంది.

మాములుగా పవన్ కళ్యాణ్ కు మొదటి నుండి ఒక అలవాటు ఉంది.

తన తోటలో పండిన మామిడి పండ్లను తన స్నేహితులకు, బంధువులకు, సినీ ప్రముఖులకు పంపిస్తుంటారు.ఆ మామిడి పండు బాక్స్ అందుకున్న ప్రముఖులు కూడా చాలా ఆనందంగా ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుని ఫుల్ ఖుషీ అయిపోతుంటారు.

పవన్ నుండి మామిడి పండు బాక్స్ అందిందంటే వారి ఆనందానికి అవధులు ఉండవు.కానీ కరోనా పరిస్థితులు వచ్చిన అప్పటి నుండి పవన్ ఎవ్వరికి మామిడి పండ్ల బాక్స్ పంపించడం లేదు.

పైగా ఈ సంవత్సరం పవన్ కూడా కరోనా బారిన పడడంతో ఈ ఆనవాయితీకి అడ్డు పడింది.ఈ లోటును తీర్చే పనిలో ఉంది పూజ హెగ్డే.

Advertisement

ఈ విషయంలో పవన్ ను ఫాలో అవుతుంది.పవన్ మామిడి పండ్ల బాక్స్ లను అందరికి పంపినట్టు ఇప్పుడు ఈ బ్యూటీ కూడా టాలీవుడ్ లో తనకు పరిచయం ఉన్న వారికీ తన తోటలోని మామిడి పండ్లను పంపిస్తుందని తెలుస్తుంది.

పూజ హెగ్డేకు బెంగళూరులో ఒక మామిడి తోట ఉందట.ఇప్పుడు ఆ తోటలోని పండ్లనే టాలీవుడ్ లోని ప్రముఖులకు పంపిస్తుంది.తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ కు, హరీష్ శంకర్ కు ఈమె నుండి మామిడి పండ్లు అందాయని తెలుస్తుంది.

ఈ విషయాన్నీ హరీష్ శంకర్ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అందరు ఈ విషయంపైనే చర్చించు కుంటున్నారు.ఆయన పోస్ట్ చేస్తూ.ఈ గెస్చర్ కు ధన్యవాదాలు తెలుపుతూ పూజ పంపిన మామిడి పండ్లను పిక్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

పూజ మామిడిపండ్ల తో పాటు ఒక మెసేజ్ కూడా పంపింది.హలొ సార్.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

ఈ రుచికరమైన సేంద్రియ మామిడి పండ్లను స్వీకరిస్తారని ఆశిస్తున్నాను అంటూ పూజ మెసేజ్ పంపింది.దీంతో హరీష్ శంకర్ ఫుల్ ఖుషీగా ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు