Pooja Hegde : పూజా హెగ్డేకు హ్యాండ్ ఇచ్చిన హరీష్ శంకర్.. బుట్టబొమ్మ సినిమాలకు గుడ్ బై చెప్పనుందా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే( Pooja Hegde ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తోంది.

ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం ఈ ఒక్క ప్రాజెక్టు మాత్రమే ఉంది.అయితే పూజా నటించిన గత సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్ గా నిలవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు కరువయ్యాయి.

మొన్నటివరకు స్టార్ హీరోయిన్ వరుసగా అవకాశాలు అందుకుంటూ ఒక వెలుగు వెలిగిన పూజ హెగ్డే ప్రస్తుతం అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది.

ఇది ఇలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూజా హెగ్డే కి ఎవరు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇద్దరు దర్శకులు మాత్రం ఆమెను తరచూ తన సినిమాలలోకి తీసుకుంటూ ఉంటారు.వారిలో ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొకరు దర్శకుడు హరీశ్ శంకర్.వీరిలో త్రివిక్రమ్ కు పూజాహెగ్డే కమిట్ మెంట్, డెడికేషన్ అంటే చాలా ఇష్టం.

Advertisement

ఇక హరీశ్ శంకర్ అయితే పూజాహెగ్డే ను సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు.పూజాకి ఎక్కువగా అవకాశాలు ఇచ్చే ఈ ఇద్దరు దర్శకులే తాజాగా ఈమెకు హ్యాండ్ ఇచ్చారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకున్న సంగతి మనందరికి తెలిసిందే.

ఆమె తప్పుకుందా, యూనిట్ తప్పించిందా అనేది వేరే విషయం.త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే లేదనేది పెద్ద షాకింగ్ అంశం.అయితే ఇప్పుడు హరీశ్ శంకర్ కూడా పూజా కి హ్యాండ్ ఇచ్చాడు.

పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్( Ustaad Bhagat Singh ) సినిమా చేస్తున్నాడు హరీశ్.ఇందులో పూజాహెగ్డే కోసం ఒక పాత్ర సిద్ధంగా ఉన్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వినిపించాయి.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

కానీ పూజాకి బదులుగా తాజాగా సాక్షి వైద్యను( Sakshi Vaidya ) ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు.దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజాహెగ్డేకు చోటు లేదనే విషయం తేలిపోయింది.

Advertisement

ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీలీల, సెకెండ్ హీరోయిన్ గా సాక్షి వైద్య కనిపించనున్నారు.గుంటూరుకారం సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకోవడానికి దర్శకుడిపై మహేష్ బాబు ఒత్తిడి ప్రధాన కారణం అని తెలుస్తోంది.

దీంతో ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా పోయింది.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పూజ హెగ్డే సినిమాలకు బాయ్ బాయ్ చెప్పడం గ్యారెంటీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

తాజా వార్తలు