తెలంగాణ‌లో పీకే పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ షురూ..! అక్క‌డ‌... ఇక్క‌డ అవే సీన్స్ రిపీట్ !

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ఖాయ‌మ‌నే సంకేతాలు వెలువ‌డుతుండ‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయం రాజుకుంటోంది.త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతూనే వ్యూహ‌క‌ర్త‌ల‌ను నియ‌మించుకుంటున్నాయి.

ఈక్ర‌మంలోనే బీజేపీని బంగాళ‌ఖాతంలో క‌లిపేస్తామ‌ని శ‌ప‌థం చేసిన సీఎం కేసీఆర్ మాత్రం వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్‌కిషోర్‌ను రంగంలోకి దింపారు.దీంతో మొత్తం పొలిటిక‌ల్ సినేరియోనే మారిపోయింది.

ప్ర‌శాంత్ కిషోర్ వ‌చ్చి మూడు నాలుగు రోజులే అయినా గ్రౌండ్ వ‌ర్క్ మొద‌లెట్టేశారు.మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హ‌త్య‌కు కుట్ర అంటూ సానుభూతి సంబంధ నాట‌కానికి ఆయ‌నే తెర‌లేపార‌ని విప‌క్షాలు విరుచుకుప‌డుతున్న విష‌యం విధిత‌మే.

ఇదే విష‌య‌మై బీజేపి మ‌హిళా నేత, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రంగా స్పందించారు.ఇలాంటి వ్యూహాలు ఉత్త‌రాదిలో చెల్లుతాయోమోగానీ తెలంగాణలో చెల్ల‌వంటూ మండిప‌డ్డారు.

Advertisement

మంత్రి పై హ‌త్యా కుట్ర పీకే పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ అని పేర్కొంటున్నారు.ఈ విష‌యంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు.

ఇలాంటి సెంటిమెంట్ రాజ‌కీయాలు గ‌తంలో కూడా ప్ర‌శాంత్ కిషోర్ న‌డిపిన విష‌యం తెలిసిందే.ఢిల్లీ, ప‌శ్చిమ‌బెంగాల్‌, బీహార్‌లో ఎక్క‌డైనా స‌రే ఆయ‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌గా ప‌నిచేసిన‌పుడు సున్నితమైన భావోద్వేగాలు రెచ్చ‌గొట్ట‌డం ఆయ‌న టెక్నిక్‌లో ఒక‌భాగం.

అలాగే చెప్పుల‌తో దాడి చేయించ‌డం, కాలికి క‌ట్టు క‌ట్టించి ప్ర‌చార స‌భ‌లు చేయ‌డం ఇవే ప్ర‌శాంత్ కిషోర్ పాలిట్రిక్స్‌.బెంగాల్ లో వీల్‌చైర్‌పై మ‌మ‌తా ప్ర‌చారం చేసేలా చేశారు.

కేజ్రీ నితీశ్ .ఇలా చెప్పుకుంటూ పోతే అనేక‌మంది నేత‌లు అనేక వ్యూహాలు ర‌చించి రాజ‌కీయ‌రంగు పులిమిన‌ విష‌యం విధిత‌మే.అలాగే మోడీ కూడా తాను ఛాయ్ వాలా అంటూ ఉద్వేగ‌భ‌రిత ప్ర‌సంగాల‌తో స‌గ‌టు భార‌తీయుడిని ఆక‌ట్టుకున్నారు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

ఇలాంటివి మ‌రువ‌క‌ముందే ప్ర‌శాంత్ కిషోర్ త‌న స్టైల్‌లో రాజ‌కీయం చేయ‌డం, చేయించ‌డం మొద‌లెట్టేయ‌డం తీవ్ర చ‌ర్ఛ‌ణీయాంశంగా మారింది.అయితే ప్ర‌శాంత్ కిషోర్‌పై డీకే అరుణ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

బెంగాల్‌లో ర‌చించిన వ్యూహాలు ఇక్క‌డ ఫ‌లించ‌వ‌ని కితాబిచ్చారు.అయితే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అవినీతిపై పోరాడుతున్న వారె ఎవ‌రైనా స‌రే వారికి తాము ఆశ్ర‌యం క‌ల్పిస్తామ‌ని చెప్పారు.

అటు ప్ర‌శాంత్ కిషోర్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జీ, ఇటు బీజేపీ నేత విమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి.

ఏకంగా బీజేపీ నేత‌లే సీన్‌లోకి ఎంట‌ర్ అయి మంత్రిపై పోరాడే వారికి ఆశ్ర‌యం ఇస్తామ‌ని చెప్ప‌డం అనుమానాల‌కు తావిస్తోంది.అస‌లు మంత్రి హ‌త్య ప్లాన్ వెనుక ఎవ‌రున్నారు ? ఇది పీకే ప‌నేనా ? ఇదో పొలిటిక‌ల్ డ్ర‌మాగా చిత్రీక‌రిస్తున్నారా ? అన్న ప్ర‌శ్న‌లు స‌గ‌టు మ‌నిషిని తొల‌చివేస్తున్నాయి.అయితే ఇదంతా శ‌రామామూలేన‌ని, ఎన్నిక‌లు అయిపోగానే పీకే కూడా తుఫాన్ మాదిరిగా వ‌చ్చి పోతాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

రానురాను పీకే తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఎలా మ‌లుపుతిప్పుతారో వేచి చూడాలి.

తాజా వార్తలు