ఘనంగా గౌడ కులస్తుల పోచమ్మ బోనాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో లో పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు నిర్వహించారు.

ఎల్లమ్మ సిద్యోగంలో భాగంగా మొదటి రోజు పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితి.

ఈ సందర్భంగా మహిళలు ఉపవాసంతో ఉంటూ,ఇంటికో బోనం నేత్తిన పెట్టుకొని, బైండ్ల పూజారుల విన్యాసాల మధ్య,శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా యువకులు డప్పు చప్పుల మధ్య నృత్యాలు చేస్తూ, పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు.

అనంతరం పోచమ్మ తల్లికి నైవేద్య సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం గౌడ కులస్తులు మాట్లాడుతూ గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, పాడిపంట, పిల్లాపాపలందరూ బాగుండాలని వేడుకున్నట్లు తెలిపారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News