నోరు విప్పి.. లెక్కలు చెప్పి ..! దూకుడు పెంచిన జగన్ 

తాడేపల్లి క్యాంపు ఆఫీసు వదిలి జగన్ బయటకు రాకపోవడం మొత్తం వ్యవహారాలన్నీ అధికారులతో చేయిస్తూ, జగన్ అన్ని వ్యవహారాలను చక్కబెట్టే వారు.

దీనిపై ప్రతిపక్షాలు జగన్ ను టార్గెట్ చేసుకుని ఎన్నో విమర్శలు చేశాయి.

జగన్ కు జనాల్లోకి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.అయినా జగన్ మాత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయం ని వదిలి బయటకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు.

తాను జనాల్లో లేక పోయినా,  తాను అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళుతున్నాయని జగన్ బలంగా నమ్ముతూ వచ్చారు.అయితే ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు జనాలలోనూ స్పందన వస్తుందడం తో పాటు, గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదని సర్వే రిపోర్టులు బయటకు రావడంతో జగన్ అలర్ట్ అయ్యారు.

గత కొద్ది రోజులుగా జిల్లా వారీగా పర్యటనలు చేపడుతున్నారు.ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లా తణుకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు , వాటి అమలు తీరు గురించి సమగ్రంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

Advertisement
Pics Describing The Progress He Has Made Including Calculations Jagan, Ysrcp, AP

తణుకులో సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.తమ ప్రభుత్వాలు ఏర్పడిన దగ్గర నుంచి ఏకంగా లక్ష 16 వేల కోట్ల రూపాయలను ఏపీలో లబ్ధిదారులకు అందించామని,  ఎవరి ప్రమేయం లేకుండా ఎటువంటి అనుమతులు లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి సొమ్ములు పడే  విధంగా చేశానని, లెక్కలతో సహా జగన్ వివరించారు.

తాను తన కార్యాలయం నుంచి బటన్ నొక్కుతుంటే మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయని అవునా కాదా అంటూ ప్రజలను నేరుగా జగన్ అడిగారు.పూర్తిగా తమ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని అనే విధంగా జగన్ ఆ సభలో ప్రసంగించారు.

Pics Describing The Progress He Has Made Including Calculations Jagan, Ysrcp, Ap

ఇక జగన్ కడప జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు.ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్ల కాలంలో ప్రొద్దుటూరులో లబ్ధిదారులకు 320 కోట్ల రూపాయల నగదును వివిధ పథకాల రూపంలో అందించినట్లు చెప్పారు.అలాగే ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చాము కూడా జగన్ చెప్పారు .ఇకపై జగన్ ఏ జిల్లాలో పర్యటించిన ఆ జిల్లాకు ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం ఎంతవరకు అందింది అనే లెక్కలతో సహా  వివరించబోతున్నారట.దీని ద్వారా జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏం చేయలేదు అని ప్రతిపక్షాల చేసే విమర్శలకు చెక్ పెట్టే విధంగా  జగన్ వ్యవహరించబోతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థం అవుతోంది.

బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్న అభిమానులు.. అలా జరగడం సాధ్యమా?
Advertisement

తాజా వార్తలు