వేములవాడలో బార్లను తలపిస్తున్న పరిమిట్ రూములు...

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బార్లను తలపిస్తున్న పర్మిట్ రూములు.నిబంధనల ప్రకారం పర్మిట్ రూమ్లల్లో బెంచీలు కుర్చీలు వేసి తిను బండారాలు అమ్మకూడదు.

అంతే కాకుండా కూర్చుండి మద్యం సేవించరాదనే నిబంధనలు కూడా ఉన్నాయి.నిబంధనలు ఉన్నప్పటికిని వైన్స్ నిర్వాహకులు పక్కనే ఉన్నటువంటి పరిమిట్ రూమ్లాల్లో దర్జాగా బార్ ను తలపించే విధంగా బెంచీలు కుర్చీలు వేసి మందుబాబులను సిట్టింగ్ చేయిస్తూ ఇస్టానుసారంగా వెజ్ మరియు నాన్ వెజ్ అమ్ముతున్నారు.

కూర్చోని మద్యం సేవించడానికి బార్లలాగే ఒక క్వార్టర్ పై 30 రూపాయలు ఒక బీరుపై 50 రూపాయల వరకు దండుకుంటూ మందుబాబుల కొంపను కొల్లేరు చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా వైన్సులు ఉదయం 10 గంటలకు తెరవాల్సి ఉండగా ఉదయం 6 గంటల నుంచే పక్కన ఉన్నటువంటి పరిమిట్లో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతుంది.

ఇంత జరుగుతున్నా కూడా ఆబ్కారి అధికారులు అటుపక్క కన్నెత్తి కూడా చూడకపోవటం ఏమిటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిమిట్ రూములలో సిట్టింగ్ పెట్టకుండా చూసి సిట్టింగ్ పెట్టినటువంటి పరిమిట్ రూములపై తగు చర్యలు తీసుకోవాలని ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement
ఏకలవ్య గురుకుల జూనియర్ కళాశాలలో మెడికల్ క్యాంప్

Latest Rajanna Sircilla News