సుప్రీం కోర్టుకి చేరిన పెగాసస్ స్పైవేర్ వ్యవహారం..!!

తాజాగా జరుగుతున్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం ప్రభుత్వాన్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తుంది.

దీనిపై చర్చ జరపాలని విపక్షాలు అటు రాజ్యసభలోనూ ఇటు పార్లమెంటులోనూ భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నాయి.

ఇటువంటి తరుణంలో పెగాసస్ స్పైవేర్ వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు చేరుకుంది.పెగాసస్ స్పైవేర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

సిట్ విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని కోరుకుంటున్నట్లు పిటిషనర్ సిపిఎం రాజ్య సభ సభ్యుడు కోరారు.

ఇజ్రాయెల్ కి చెందిన పెగాసస్ స్పైవేర్ సాఫ్ట్వేర్ ఉపయోగించి. ప్రత్యర్థి రాజకీయ నేతల.జర్నలిస్టుల ఫోన్లు ఇంకా కార్యకర్తలు ఫోన్ల పై ప్రభుత్వం నిఘా వేసినట్లూ వస్తున్న ఆరోపణలపై విచారణ ప్రారంభించాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు.స్వేచ్ఛ.

Advertisement

భావ వ్యక్తీకరణ రూపుమాపే రీతిలో వ్యవహారం ఉందని పిటిషనర్ కోర్టుకు దృష్టికి తెచ్చారు.ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే రీతిలో ప్రభుత్వం నిఘా వ్యవస్థను తప్పుదారి పట్టించే రీతిలో పనిచేస్తుందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.

ఈ విషయంలో న్యాయస్థానం ఖచ్చితంగా కలగజేసుకుని పూర్తి విచారణ జరపాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు