తెలంగాణ లో  పర్యటనకు పవన్ షెడ్యూల్ ? 

ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఒకపక్క ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.

టిడిపి తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని సిద్ధం చేసుకున్నారు.

సీట్ల విషయంలో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అధికారికంగా పొత్తును ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ విషయంలో ఎన్ని విమర్శలు వస్తున్నా.

పవన్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే జరగబోయే నష్టం ఏమిటో పవన్ ముందుగానే గుర్తించారు.

అందుకే ఒంటరిగా వీరమరణం పొందే కంటే,  పొత్తులతో ముందుకు వెళ్లడమే మంచిది అంటూ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సభలో వ్యాఖ్యానించారు.

Advertisement

 ఇక పూర్తిగా ఏపీ రాజకీయాలపై దృష్టి సారిస్తారని అంతా అంచనా వేస్తుండగా , తెలంగాణలోనూ పర్యటించేందుకు రూట్ మ్యాప్ చేసుకుంటున్నారు.ముందుగా కొండ గుట్ట ధర్మపురి క్షేత్రాలను సందర్శించబోతున్నారు.ఈ నెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగుట్ట ఆంజనేయస్వామిని దర్శించుకుని ఆలయ సన్నిధిలో వారాహి వాహనానికి పూజలు చేయాలని నిర్ణయించారు.

ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్వీట్ ద్వారా తెలియజేసింది.పవన్ వారాహి వాహనాన్ని ఇక్కడి నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.ఆ తరువాత తెలంగాణ జనసేన నాయకులతో సమావేశం నిర్వహించబోతున్నారట .రాబోయే ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి ? ఎవరితో పొత్తు పెట్టుకోవాలి.ఇలా అనేక అంశాలపై పార్టీ నాయకులతో చర్చించబోతున్నారట. 

 ఏపీ మాదిరిగానే తెలంగాణ రాజకీయాలలోను యాక్టివ్ గా ఉంటూ ఇక్కడ జనసేన ను మరింత బలోపేతం చేసేందుకు పవన్ ప్లాన్ చేసుకుంటున్నారు.అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తారనే విషయంలో పవన్ కు సైతం ఇంకా క్లారిటీ రాలేదట.అయినా రాజకీయంగా తెలంగాణలో జనసేన ను బలోపేతం చేస్తే ఎన్నికల సమయంలో కీలకం అవుతాము అనే అంచనాలో పవన్ ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.

రామ్ చరణ్ తో సినిమాకు రెడీ అయిన తమిళ్ స్టార్ డైరెక్టర్...
Advertisement

తాజా వార్తలు