జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సీరియస్ కామెంట్స్ చేశారు.మంగళగిరి పార్టీ ప్రధాన ఈ ఆలయంలో జరిగిన సమావేశంలో ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.ఇటీవల ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు.అభివృద్ధి పేరిట ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీరియస్ అయ్యారు.స్వయంగా తాడేపల్లి లో సీఎం క్యాంపు కార్యాలయం సమీపంలో అభివృద్ధి పేరిట.వైసిపి నాయకులు భూములు ఖాళీ చేయాలని.
అంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ కి బాధితులు తెలియజేశారు.ఖాళీ చేయక పోతే బెదిరింపులకు పాల్పడుతున్నారని పునరావాసం కూడా ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని పవన్ దృష్టికి తీసుకొచ్చారు.
దీంతో ఈ విషయంలో స్పందించిన పవన్ కళ్యాణ్ స్వయంగా సీఎం ఇంటి వద్దే దాదాపు 320 ఇల్లు ఖాళీ చేయాలని.బెదిరింపులకు పాల్పడటం దారుణమని అన్నారు.ఇక ఇదే రీతిలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు విషయంపై కూడా పవన్ సీరియస్ అయ్యారు.నిజంగా ఇల్లు కూల్చలి అనుకుంటే ముందుగా పునరావాసం కల్పించి… పక్కా ఇళ్లు కట్టించి అప్పుడు ఖాళీచేయిస్తే బాగుంటుందని తెలిపారు.
అలా కాకుండా దాడులకు పాల్పడితే బెదిరింపులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదని పవన్ సీరియస్ అయ్యారు.

ఇక ఇదే సమావేశంలో.నిరుద్యోగులు మరికొంతమంది మహిళలు వైద్య సిబ్బంది కూడా తమ కష్టాలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా వారు అందరికీ పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
ప్రజల తరఫున పోరాటాలు చేయడానికి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఇక ఇదే సమయంలో దేశంలో కరోనా కారణంగా మరణించిన మృతులకు పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు.